Enno raatrulostaayi gaanee raadee ven

ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్
Year
Language

పల్లవి:

ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
అన్నాడే... చిన్నోడూ .. అన్నిట్లో... ఉన్నోడూ...

ఆహా .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా

చరణం 1:

ఎన్ని మోహాలు మోసీ .. ఎదల దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే .. ఓహోహో
నేనెన్ని కాలాలు వేచా .. ఎన్ని గాలాలు వేసా
మనసు అడిగే మరుల సుడికే .. ఓహోహో

మంచం ఒకరితో అలిగినా .. మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా .. సాయం వయసునే అడిగినా !

ఓ .. ఓ .. ఓ .. ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా

చరణం 2:

గట్టివత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే .. ఓహోహో
నీ గోటిగిచ్చుళ్ళ కోసం మొగ్గ చెక్కిళ్ళు ఇచ్చా
చిలిపి పనులా చెలిమి జతకే .. ఓహోహో

అంతే ఎరుగనీ అమరికా .. ఎంతో మధురమీ బడలికా
ఛీ ..! పో బిడియమా సెలవికా .. నాకీ పరువమే పరువికా !

హో .. ఓ .. ఓ .. ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
అన్నాడే... చిన్నోడూ .. అన్నిట్లో... ఉన్నోడూ...

ఒహో .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
అహా..ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా

pallavi:

ĕnno rātrulŏstāyi gānī rādī vĕnnĕlammā
ĕnno muddulistāru gānī ledī veḍisĕmmā
annāḍe... sinnoḍū .. anniṭlo... unnoḍū...

āhā .. ĕnno rātrulŏstāyi gānī rādī vĕnnĕlammā
ĕnno muddulistāru gānī ledī veḍisĕmmā

saraṇaṁ 1:

ĕnni mohālu mosī .. ĕdala dāhālu dāsā
pĕdavi kŏrige pĕdavi kŏrage .. ohoho
nenĕnni kālālu vesā .. ĕnni gālālu vesā
manasu aḍige marula suḍige .. ohoho

maṁchaṁ ŏgarido aliginā .. maunaṁ valabule sadivinā
prāyaṁ sŏgasule vĕdiginā .. sāyaṁ vayasune aḍiginā !

o .. o .. o .. o
ĕnno rātrulŏstāyi gānī rādī vĕnnĕlammā
ĕnno muddulistāru gānī ledī veḍisĕmmā

saraṇaṁ 2:

gaṭṭivattiḽḽa kosaṁ gāli kaugiḽḽu tĕchchā
tŏḍima tĕrise tŏnala rusige .. ohoho
nī goḍigichchuḽḽa kosaṁ mŏgga sĕkkiḽḽu ichchā
silibi panulā sĕlimi jadage .. ohoho

aṁte ĕruganī amarigā .. ĕṁto madhuramī baḍaligā
shī ..! po biḍiyamā sĕlavigā .. nāgī paruvame paruvigā !

ho .. o .. o .. o
ĕnno rātrulŏstāyi gānī rādī vĕnnĕlammā
ĕnno muddulistāru gānī ledī veḍisĕmmā
annāḍe... sinnoḍū .. anniṭlo... unnoḍū...

ŏho .. ĕnno rātrulŏstāyi gānī rādī vĕnnĕlammā
ahā..ĕnno muddulistāru gānī ledī veḍisĕmmā