ఎన్నినోములు నోఁచెనో యీ రమణి
(॥పల్లవి॥)
ఎన్నినోములు నోఁచెనో యీ రమణి
చన్నుల జవ్వనపు సంపదతోడా
(॥ఎన్ని॥)
వలపుగద్దె యెక్కె వనితా
చెలపచెమటఅభిషేకముతోడ
కొలువు సేయించుకొనీఁ జెలులచేతా
బలిమి నిట్టచూపులసం(పం?) జులతోడా
(॥ఎన్ని॥)
కోరికలరాజ్యమేలీఁ గోమలి
నూరువేలుపులకకానుకలతోడ
చేరిశైత్యోపచారాలు సేయించుకొనీ
సారెఁ గొప్పునల్లజల్లిచామరాలతోడా
(॥ఎన్ని॥)
మరుపట్ట మలమేలుమంగ గట్టె
వురమున శ్రీవేంకటోత్తముతోడా
గరిమఁ గప్పముగొనెఁ గళలెల్లాను
సురతపుకొనగోరిసొమ్ములతోడా
(||pallavi||)
ĕnninomulu nom̐sĕno yī ramaṇi
sannula javvanabu saṁpadadoḍā
(||ĕnni||)
valabugaddĕ yĕkkĕ vanidā
sĕlabasĕmaḍaabhiṣhegamudoḍa
kŏluvu seyiṁchugŏnīm̐ jĕlulasedā
balimi niṭṭasūbulasaṁ(paṁ?) juladoḍā
(||ĕnni||)
korigalarājyamelīm̐ gomali
nūruvelubulagagānugaladoḍa
seriśhaityobasārālu seyiṁchugŏnī
sārĕm̐ gŏppunallajallisāmarāladoḍā
(||ĕnni||)
marubaṭṭa malamelumaṁga gaṭṭĕ
vuramuna śhrīveṁkaḍottamudoḍā
garimam̐ gappamugŏnĕm̐ gaḽalĕllānu
suradabugŏnagorisŏmmuladoḍā