(॥పల్లవి॥)
ఎన్నిఁ గతలఁ గఱచె నీ వనిత
సన్నలెల్లా దొంతి వెట్టి జట్టి సేసె వలపు
(॥ఎన్ని॥)
చేరి వద్ద గూచుండి చెవి కింపుగా నీతో
నేరుపుల మాఁట లాడీ నెలఁత
తేరకొన మోము చూచి తీగెలు సాగఁబెట్టి
కేరికేరి నవ్వు నవ్వి కెరిలించీ నీకు
(॥ఎన్ని॥)
మచ్చికలు వచరించి మనసు గరఁగ నీకు
యచ్చకమ లెల్లాఁ జేసీ నింతి
పచ్చిదేనియలు గార పగడవాతెర మోపి
ముచ్చటలఁ జూపి చూపి ముదిరించీ వలపు
(॥ఎన్ని॥)
కుంకుమ గుబ్బల నొత్తి కుచ్చి కుచ్చి కాఁగిలించి
లంకెలకు నిన్నుఁ దీసి లలన
అంకెల శ్రీవేంకటేశ యన్నిటా నన్నేలితి
పొంకముగ మొక్కిమొక్కి పూఁచీ నీకె వలపు
(||pallavi||)
ĕnnim̐ gadalam̐ gaṟasĕ nī vanida
sannalĕllā dŏṁti vĕṭṭi jaṭṭi sesĕ valabu
(||ĕnni||)
seri vadda gūsuṁḍi sĕvi kiṁpugā nīdo
nerubula mām̐ṭa lāḍī nĕlam̐ta
teragŏna momu sūsi tīgĕlu sāgam̐bĕṭṭi
kerigeri navvu navvi kĕriliṁchī nīgu
(||ĕnni||)
machchigalu vasariṁchi manasu garam̐ga nīgu
yachchagama lĕllām̐ jesī niṁti
pachchideniyalu gāra pagaḍavādĕra mobi
muchchaḍalam̐ jūbi sūbi mudiriṁchī valabu
(||ĕnni||)
kuṁkuma gubbala nŏtti kuchchi kuchchi kām̐giliṁchi
laṁkĕlagu ninnum̐ dīsi lalana
aṁkĕla śhrīveṁkaḍeśha yanniḍā nannelidi
pŏṁkamuga mŏkkimŏkki pūm̐sī nīgĕ valabu