ఎన్ని చందాలదాననే ఇంతిరో నీవు
(॥పల్లవి॥)
ఎన్ని చందాలదాననే ఇంతిరో నీవు
ఇన్నేసి నేరుచుకొంటి విందరిలో నీవు
(॥॥)
నిక్కించేవు నీవురము నేఁడు నీపతి యెదుట
పిక్కటిల్లి చన్నులిట్టె పెరిగీనటే
పక్కనఁ జెమట పూవుబంతినే అద్దుకొనేవు
చిక్కనినీసింగారము చిందీనటే
(॥॥)
పొడవుగ నేడలేనిబోలుఁ గొప్పు వెట్టితివి
నిడుపులు సాగీనటే నీనెరులు
మడుగుఁ జీర మడిచిమడిచి కట్టుకొంటివి
తొడిఁ బడఁ బిరుఁ దిది దొడ్డాయనటవే
(॥॥)
వెరగుమాడి యీతని వేమారుఁ జూచేవు
బెరసి నీకన్ను లింకాఁ బెద్దవౌనటే
పరగ నలమేల్మంగపతి శ్రీ వేంకటేశుఁ డు
మరిగి నన్నేలె నీకూ మగఁడయ్యీ నటవే
(||pallavi||)
ĕnni saṁdāladānane iṁtiro nīvu
innesi nerusugŏṁṭi viṁdarilo nīvu
(||||)
nikkiṁchevu nīvuramu nem̐ḍu nībadi yĕduḍa
pikkaḍilli sannuliṭṭĕ pĕrigīnaḍe
pakkanam̐ jĕmaḍa pūvubaṁtine addugŏnevu
sikkaninīsiṁgāramu siṁdīnaḍe
(||||)
pŏḍavuga neḍalenibolum̐ gŏppu vĕṭṭidivi
niḍubulu sāgīnaḍe nīnĕrulu
maḍugum̐ jīra maḍisimaḍisi kaṭṭugŏṁṭivi
tŏḍim̐ baḍam̐ birum̐ didi dŏḍḍāyanaḍave
(||||)
vĕragumāḍi yīdani vemārum̐ jūsevu
bĕrasi nīgannu liṁkām̐ bĕddavaunaḍe
paraga nalamelmaṁgabadi śhrī veṁkaḍeśhum̐ ḍu
marigi nannelĕ nīgū magam̐ḍayyī naḍave