Enni nerusugomtivi yemtani samtoshimche

ఎన్ని నేరుచుకొంటివి యెంతని సంతోషించే
Language

(॥పల్లవి॥)
ఎన్ని నేరుచుకొంటివి యెంతని సంతోషించే-
నన్నిటా నిందుకే నేను ఆలనైతి నీకు

(॥ఎన్ని॥)
ఆయములు గరఁగఁగ నంటి మాటలాడేవు
చేయిమీఁదుగానే చెనకేవు
పాయపుమదము రేఁగ పచ్చిగానే పెనఁగేవు
చాయలసన్నల మోవిచవులు చూపేవు

(॥ఎన్ని॥)
ఆసలెల్లఁ బుట్టించి యట్టె తప్పకచూచేవు
లాసి కుచములు ముట్టి లాలించేవు
వాసనలు మేనఁ బూసి వాడికలు సేసేవు
పోసరించఁ జెక్కు నొక్కి పొందు నెరుపేవు

(॥ఎన్ని॥)
కళలు పైపై రేఁగ గాఁగిలించి కూడేవు
కులికి నోరిలోఁ దమ్మ కుమ్మరించేవు
నెలవై శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
కలసి నన్నిట్లానే కడుమన్నించేవు

(||pallavi||)
ĕnni nerusugŏṁṭivi yĕṁtani saṁtoṣhiṁche-
nanniḍā niṁduge nenu ālanaidi nīgu

(||ĕnni||)
āyamulu garam̐gam̐ga naṁṭi māḍalāḍevu
seyimīm̐dugāne sĕnagevu
pāyabumadamu rem̐ga pachchigāne pĕnam̐gevu
sāyalasannala movisavulu sūbevu

(||ĕnni||)
āsalĕllam̐ buṭṭiṁchi yaṭṭĕ tappagasūsevu
lāsi kusamulu muṭṭi lāliṁchevu
vāsanalu menam̐ būsi vāḍigalu sesevu
posariṁcham̐ jĕkku nŏkki pŏṁdu nĕrubevu

(||ĕnni||)
kaḽalu paibai rem̐ga gām̐giliṁchi kūḍevu
kuligi norilom̐ damma kummariṁchevu
nĕlavai śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
kalasi nanniṭlāne kaḍumanniṁchevu