Enni levu nee suddulu yemcham baniledugaaga

ఎన్ని లేవు నీ సుద్దులు యెంచఁ బనిలేదుగాక
Language

(॥పల్లవి॥)
ఎన్ని లేవు నీ సుద్దులు యెంచఁ బనిలేదుగాక
పన్నుక యిన్నిటాఁ జెల్లుబడైనవేకావా

(॥ఎన్ని॥)
అంటే నీ మాఁటలకు నడ్డమాడరాదుగాక
నంటున గుంచె దానితో నవ్వవా నీవు
దంటతనమున నీపై దప్పువేయరాదుగాక
యింటికాడఁ గాళాంజాపె కియ్యవా విడెము

(॥ఎన్ని॥)
సారె సారె నీ చేఁతలు చక్కఁబెట్టరాదుగాక
చేరి యాల వట్ట మాపెఁ జెక్కు నొక్కవా
తారుకాణ సేసి నిన్నుఁ దడవఁగరాదుగాక
కోరి యడపముదానిఁ గొనగోర నూఁదవా

(॥ఎన్ని॥)
వేడుకతో నిన్ను వెల్లవిరి సేయరాదుగాక
వాడికఁ గట్టి కాపెను వలపించవా
యీడనె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
వూడిగాలవారినెల్లా వొక్కొకవేళంటవా

(||pallavi||)
ĕnni levu nī suddulu yĕṁcham̐ baniledugāga
pannuga yinniḍām̐ jĕllubaḍainavegāvā

(||ĕnni||)
aṁṭe nī mām̐ṭalagu naḍḍamāḍarādugāga
naṁṭuna guṁchĕ dānido navvavā nīvu
daṁṭadanamuna nībai dappuveyarādugāga
yiṁṭigāḍam̐ gāḽāṁjābĕ kiyyavā viḍĕmu

(||ĕnni||)
sārĕ sārĕ nī sem̐talu sakkam̐bĕṭṭarādugāga
seri yāla vaṭṭa mābĕm̐ jĕkku nŏkkavā
tārugāṇa sesi ninnum̐ daḍavam̐garādugāga
kori yaḍabamudānim̐ gŏnagora nūm̐davā

(||ĕnni||)
veḍugado ninnu vĕllaviri seyarādugāga
vāḍigam̐ gaṭṭi kābĕnu valabiṁchavā
yīḍanĕ śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
vūḍigālavārinĕllā vŏkkŏgaveḽaṁṭavā