Enni dalabomtaladi yemta yemmelaamdi idi

ఎన్ని దలపోఁతలది యెంత యెమ్మెలాఁడి ఇది
Language

(॥పల్లవి॥)
ఎన్ని దలపోఁతలది యెంత యెమ్మెలాఁడి ఇది
కన్నులారా దీనిగుట్టు గంటివా వోయి

(॥ఎన్ని॥)
అందమై కాఁగిట నీపై నంటవలెనంటాను
పొందుగఁ గస్తూరి మేనఁ బూసుకొన్నది
యెందుఁ దనరాక నీవెఱఁగవలెనంటాను
అందెలు బావాలతోడ నదివో వచ్చినది

(॥ఎన్ని॥)
తతి విడెమిచ్చితేను తాఁకవలెనంటాను
అతివాఁడిగాఁ జేసు కదెవున్నది
రతివేళ విరులెల్లా రాలవలె నీపైనంటా
జతనానఁ దురిమెను జాజులు సంపగలు

(॥ఎన్ని॥)
తనపై నీచూపులు తగులవలెనంటాను
కొనబుగా సింగారించుకొని వున్నది
యెనసితివి శ్రీవేంకటేశ ఇంతలొ నన్ను
తను నేలవలెనంటా దండ నిలుచున్నది

(||pallavi||)
ĕnni dalabom̐taladi yĕṁta yĕmmĕlām̐ḍi idi
kannulārā dīniguṭṭu gaṁṭivā voyi

(||ĕnni||)
aṁdamai kām̐giḍa nībai naṁṭavalĕnaṁṭānu
pŏṁdugam̐ gastūri menam̐ būsugŏnnadi
yĕṁdum̐ danarāga nīvĕṟam̐gavalĕnaṁṭānu
aṁdĕlu bāvāladoḍa nadivo vachchinadi

(||ĕnni||)
tadi viḍĕmichchidenu tām̐kavalĕnaṁṭānu
adivām̐ḍigām̐ jesu kadĕvunnadi
radiveḽa virulĕllā rālavalĕ nībainaṁṭā
jadanānam̐ durimĕnu jājulu saṁpagalu

(||ĕnni||)
tanabai nīsūbulu tagulavalĕnaṁṭānu
kŏnabugā siṁgāriṁchugŏni vunnadi
yĕnasidivi śhrīveṁkaḍeśha iṁtalŏ nannu
tanu nelavalĕnaṁṭā daṁḍa nilusunnadi