Ennesi vidyalu nerse nee ramani

ఎన్నేసి విద్యలు నేర్చె నీ రమణి
Language

(॥పల్లవి॥)
ఎన్నేసి విద్యలు నేర్చె నీ రమణి
చెన్నుమీరె నిన్నిటాను చిత్తగించవయ్యా

(॥ఎన్నో॥)
వనితచెమటలనె వానలు గురిసీ నదె
నినునవ్వులనె వెన్నెలగాసీని
పనులుసేసేవూర్పుల పయ్యరగాలి విసరి
చెనకీ నీదేవులు చిత్తగించవయ్యా

(॥ఎన్నో॥)
విరహపువేడుక వేసఁగియెండలు గాసీ
సొరిఁది సిగ్గులనే మంచులు గప్పీని
వరుస మోవితేనెల వసంతకాలము చూపీ
సిరుల నీవేడుకలు చిత్తగించవయ్యా

(॥ఎన్నో॥)
కందువచూపులనే కడుమెఱుఁగులు చల్లీ
అందపురతులనే వియ్యము లందీని
యిందుకె శ్రీవేంకటేశ యేలితి వీకెను నేఁడు
చిందీ నదె తరితీపు చిత్తగించవయ్యా

(||pallavi||)
ĕnnesi vidyalu nersĕ nī ramaṇi
sĕnnumīrĕ ninniḍānu sittagiṁchavayyā

(||ĕnno||)
vanidasĕmaḍalanĕ vānalu gurisī nadĕ
ninunavvulanĕ vĕnnĕlagāsīni
panulusesevūrbula payyaragāli visari
sĕnagī nīdevulu sittagiṁchavayyā

(||ĕnno||)
virahabuveḍuga vesam̐giyĕṁḍalu gāsī
sŏrim̐di siggulane maṁchulu gappīni
varusa movidenĕla vasaṁtagālamu sūbī
sirula nīveḍugalu sittagiṁchavayyā

(||ĕnno||)
kaṁduvasūbulane kaḍumĕṟum̐gulu sallī
aṁdaburadulane viyyamu laṁdīni
yiṁdugĕ śhrīveṁkaḍeśha yelidi vīgĕnu nem̐ḍu
siṁdī nadĕ taridību sittagiṁchavayyā