Ennenno amdaalu

ఎన్నెన్నో అందాలు
Work
Year
Language

పల్లవి:

ఎన్నెన్నో అందాలు... ఏవేవో రాగాలు...
వేసే పూల బాణం.. పూసే గాలి గంధం
పొద్దేలేని ఆకాశం... హద్దేలేని ఆనందం..
ఎన్నెన్నో అందాలు... ఏవేవో రాగాలు

చరణం 1:

సిరిగల చిలకలు ఇలదిగి నడచుట న్యాయమా? ధర్మమా?
తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా..

చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా?
అలికిన గుడెసెల చలువుల మనసులు మేడలో దొరుకునా

అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను...
బంగారూ పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను
నిరుపేదిల్లు పొదరిల్లు...
ఇలలో ఉన్న హరివిల్లు...

ఎన్నెన్నో అందాలు... ఏవేవో రాగాలు..
వేసే పూల బాణం పూసే గాలి గంధం
పొద్దేలేని ఆకాశం... హద్దేలేని ఆనందం..
ఎన్నెన్నో అందాలు... ఏవేవో రాగాలు...

చరణం 2:

జలజల పదముల అలజడి నదులకు వంత నే పాడనా
మిలమిల మెరిసిన తళతళ తారలు నింగినే వీడునా

చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పూయునా
మిణుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా

ఏ గాలిమేడల్లోనో దీపంలా నే ఉన్నా
మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా
గోదారమ్మ పరవళ్ళు..
తెలుగింటమ్మ తిరునాళ్ళు...

ఎన్నెన్నో అందాలు... ఏవేవో రాగాలు..
వేసే పూల బాణం పూసే గాలి గంధం
పొద్దేలేని ఆకాశం... హద్దేలేని ఆనందం..
ఎన్నెన్నో అందాలు... ఏవేవో రాగాలు.

pallavi:

ĕnnĕnno aṁdālu... evevo rāgālu...
vese pūla bāṇaṁ.. pūse gāli gaṁdhaṁ
pŏddeleni āgāśhaṁ... haddeleni ānaṁdaṁ..
ĕnnĕnno aṁdālu... evevo rāgālu

saraṇaṁ 1:

sirigala silagalu iladigi naḍasuḍa nyāyamā? dharmamā?
tŏlagari mĕrubulu siligina sinugulu niṁgilo āgunā..

salimara gadulalo sukhabaḍu badugulu vesave korunā?
aligina guḍĕsĕla saluvula manasulu meḍalo dŏrugunā

aṁdāla meḍallone aṁṭadu kāligi mannu...
baṁgārū paṁṭalu paṁḍe mannugu sāladu minnu
nirubedillu pŏdarillu...
ilalo unna harivillu...

ĕnnĕnno aṁdālu... evevo rāgālu..
vese pūla bāṇaṁ pūse gāli gaṁdhaṁ
pŏddeleni āgāśhaṁ... haddeleni ānaṁdaṁ..
ĕnnĕnno aṁdālu... evevo rāgālu...

saraṇaṁ 2:

jalajala padamula alajaḍi nadulagu vaṁta ne pāḍanā
milamila mĕrisina taḽadaḽa tāralu niṁgine vīḍunā

sĕruvula kaḍubuna virisina tāmara tenĕle pūyunā
miṇuguru purugula miḍimiḍi vĕlugulu vĕnnĕlai kāyunā

e gālimeḍallono dībaṁlā ne unnā
mā pallĕ siṁgārālu nīlo nene kannā
godāramma paravaḽḽu..
tĕlugiṁṭamma tirunāḽḽu...

ĕnnĕnno aṁdālu... evevo rāgālu..
vese pūla bāṇaṁ pūse gāli gaṁdhaṁ
pŏddeleni āgāśhaṁ... haddeleni ānaṁdaṁ..
ĕnnĕnno aṁdālu... evevo rāgālu.