ఎన్నెన్ని మేళ్లుగలవో యింకా నాపెవల్ల
(॥పల్లవి॥)
ఎన్నెన్ని మేళ్లుగలవో యింకా నాపెవల్ల
సన్నసేసి యేకతాన జరయవయ్యా
(॥ఎన్నె॥)
సంగడి జాణతనాలు సారెకు నాడీ నాపె
జంగిలి వావులకుఁ జేచాఁచీ నీకాపె
గుంగిలి సరసముల గురులు సోఁకించీ నాపె
కొంగువట్టి నీవింకాఁ గొసరవయ్యా
(॥ఎన్నె॥)
బయలు నవ్వులు మరీఁ బైపై నవ్వీ నాపె
దయివారుఁజూపులఁగాఁతాళించీ నాపె
నయగారవలపులు నానఁబెట్టీ నీపై నాపె
ప్రియమునఁ జెక్కు నొక్కి పెనఁగవయ్యా
(॥ఎన్నె॥)
మూఁటగట్టువినయాలు మొక్కులు మొక్కీ నాపె
వాఁటపు మోవితేనెలు వంచీ నాపె
యీటువెట్టి శ్రీవేంకటేశ నన్ను నేలితివి
జూటుఁదనము లాపెను సొలయవయ్యా
(||pallavi||)
ĕnnĕnni meḽlugalavo yiṁkā nābĕvalla
sannasesi yegadāna jarayavayyā
(||ĕnnĕ||)
saṁgaḍi jāṇadanālu sārĕgu nāḍī nābĕ
jaṁgili vāvulagum̐ jesām̐sī nīgābĕ
guṁgili sarasamula gurulu som̐kiṁchī nābĕ
kŏṁguvaṭṭi nīviṁkām̐ gŏsaravayyā
(||ĕnnĕ||)
bayalu navvulu marīm̐ baibai navvī nābĕ
dayivārum̐jūbulam̐gām̐tāḽiṁchī nābĕ
nayagāravalabulu nānam̐bĕṭṭī nībai nābĕ
priyamunam̐ jĕkku nŏkki pĕnam̐gavayyā
(||ĕnnĕ||)
mūm̐ṭagaṭṭuvinayālu mŏkkulu mŏkkī nābĕ
vām̐ṭabu movidenĕlu vaṁchī nābĕ
yīḍuvĕṭṭi śhrīveṁkaḍeśha nannu nelidivi
jūḍum̐danamu lābĕnu sŏlayavayyā