Enneni vinnavimche mibudu neegu

ఎన్నేని విన్నవించే మిపుడు నీకు
Language

(॥పల్లవి॥)
ఎన్నేని విన్నవించే మిపుడు నీకు
అన్నీ నీవే తెలుసుక యాదరించవయ్యా

(॥ఎన్నే॥)
అలివేణిమదిలోని ఆడియాసలు
పలుకుల వినయపు పరిబాసలు
చెలరేఁగి పట్టిన దోసిటి సేసలు
చెలియ చందము లివి చిత్తగించవయ్యా

(॥ఎన్నే॥)
కమ్ముకొన్న తమకపుకనుచూపులు
తమ్ములపు మోవితేనె తరితీపులు
పిమ్మట సన్నలు సేసే పెరరేఁపులు
నెమ్మది నీవెచూచి మన్నించఁగదవయ్యా

(॥ఎన్నే॥)
వొద్దికైననీపై మొగమోటలు
కొద్దిలేని నీ రతులు కూటములు
ముద్దరాలి నేలితివి ముప్పిరి శ్రీవేంకటేశ
పొద్దు వొద్దు దప్పకుండా భోగించవయ్యా

(||pallavi||)
ĕnneni vinnaviṁche mibuḍu nīgu
annī nīve tĕlusuga yādariṁchavayyā

(||ĕnne||)
aliveṇimadiloni āḍiyāsalu
palugula vinayabu paribāsalu
sĕlarem̐gi paṭṭina dosiḍi sesalu
sĕliya saṁdamu livi sittagiṁchavayyā

(||ĕnne||)
kammugŏnna tamagabuganusūbulu
tammulabu movidenĕ taridībulu
pimmaḍa sannalu sese pĕrarem̐pulu
nĕmmadi nīvĕsūsi manniṁcham̐gadavayyā

(||ĕnne||)
vŏddigainanībai mŏgamoḍalu
kŏddileni nī radulu kūḍamulu
muddarāli nelidivi muppiri śhrīveṁkaḍeśha
pŏddu vŏddu dappaguṁḍā bhogiṁchavayyā