ఎన్నఁడు నేరిచెనో యింతేసి దంటతనాలు
(॥పల్లవి॥)
ఎన్నఁడు నేరిచెనో యింతేసి దంటతనాలు
కన్నుల పండువుగాను కంటి మీకె చేఁతలు
(॥ఎన్నఁ॥)
సేసవెట్టి పెండ్లాడిన చెలి నీవద్ద నుండఁగా
ఆస లేమి చూపీనే ఆకె నీకును
వాసివంతులెంచుకోదు వల పారడిఁబెట్టుక
వేసాలెల్లాఁ జేయఁగాను వెరగాయ నాకు
(॥ఎన్నఁ॥)
కాఁపురము సేసీ ఇంతి కదిసి సేవసేయఁగా
ఆడలేక మాటలాడీ నప్పటిఁ దాను
యీపె తగ వెఱఁగక యెమ్మెలఁ బొరలుకొంటా
పూఁపనవ్వులు నవ్వీని పొద్దువోదోకాని
(॥ఎన్న॥)
పట్టపు టలమేల్మంగ పాదాలు నీ కొత్తఁగాను
యెట్టు నీతోఁ బొందుసేసీ నెంత చుట్టమో
యిట్టె శ్రీవేకంటేశ ఇందరి నీ వేలితివి
చుట్టి నిన్నుఁ గాఁగిలించీ చూడు మెంతసోద్యము
(||pallavi||)
ĕnnam̐ḍu nerisĕno yiṁtesi daṁṭadanālu
kannula paṁḍuvugānu kaṁṭi mīgĕ sem̐talu
(||ĕnnam̐||)
sesavĕṭṭi pĕṁḍlāḍina sĕli nīvadda nuṁḍam̐gā
āsa lemi sūbīne āgĕ nīgunu
vāsivaṁtulĕṁchugodu vala pāraḍim̐bĕṭṭuga
vesālĕllām̐ jeyam̐gānu vĕragāya nāgu
(||ĕnnam̐||)
kām̐puramu sesī iṁti kadisi sevaseyam̐gā
āḍalega māḍalāḍī nappaḍim̐ dānu
yībĕ taga vĕṟam̐gaga yĕmmĕlam̐ bŏralugŏṁṭā
pūm̐panavvulu navvīni pŏdduvodogāni
(||ĕnna||)
paṭṭabu ṭalamelmaṁga pādālu nī kŏttam̐gānu
yĕṭṭu nīdom̐ bŏṁdusesī nĕṁta suṭṭamo
yiṭṭĕ śhrīvegaṁṭeśha iṁdari nī velidivi
suṭṭi ninnum̐ gām̐giliṁchī sūḍu mĕṁtasodyamu