Ennamdu neṟamgamamma yimtulaala

ఎన్నఁడు నెఱఁగమమ్మ యింతులాల
Language

(॥పల్లవి॥)
ఎన్నఁడు నెఱఁగమమ్మ యింతులాల
కన్నెకు నెందుండివచ్చెఁ గాఁకలెల్లా నిపుడు

(॥ఎన్న॥)
తలపోఁతే ఘనమాయఁ దరుణికి నేపొద్దు
నెలవై కుచగిరులు నిక్కఁగాను
అలరి మీఁదటిపను లైనరీతి నాయఁగాని
కలిగెఁబో యేడలేని కాఁతాళ మిపుడు

(॥ఎన్న॥)
చెక్కుచేయి ఘనమాయఁ జెలియకు నీవేళ
నిక్కి జవ్వనము మేన నిలువఁగాను
యెక్కు వమదనకళ లేచినప్పు డేచెఁగాని
దక్కెఁబో తమకములతడఁబా ట్లిపుడు

(॥ఎన్న॥)
వేడుకలే ఘనమాయ వెలయు శ్రీవేంకటేశుఁ-
డీడ నేఁ డీయింతి నెనయఁగాను
మేడెపుఁజెమటలెల్ల మించినాను మించెఁగాని
కూడెఁబో రతులలోని కూటము లిన్నయును

(||pallavi||)
ĕnnam̐ḍu nĕṟam̐gamamma yiṁtulāla
kannĕgu nĕṁduṁḍivachchĕm̐ gām̐kalĕllā nibuḍu

(||ĕnna||)
talabom̐te ghanamāyam̐ daruṇigi nebŏddu
nĕlavai kusagirulu nikkam̐gānu
alari mīm̐daḍibanu lainarīdi nāyam̐gāni
kaligĕm̐bo yeḍaleni kām̐tāḽa mibuḍu

(||ĕnna||)
sĕkkuseyi ghanamāyam̐ jĕliyagu nīveḽa
nikki javvanamu mena niluvam̐gānu
yĕkku vamadanagaḽa lesinappu ḍesĕm̐gāni
dakkĕm̐bo tamagamuladaḍam̐bā ṭlibuḍu

(||ĕnna||)
veḍugale ghanamāya vĕlayu śhrīveṁkaḍeśhum̐-
ḍīḍa nem̐ ḍīyiṁti nĕnayam̐gānu
meḍĕbum̐jĕmaḍalĕlla miṁchinānu miṁchĕm̐gāni
kūḍĕm̐bo radulaloni kūḍamu linnayunu