ఎన్నఁడు దానెఱఁగము యింతదడ వీ సతిని
(॥పల్లవి॥)
ఎన్నఁడు దానెఱఁగము యింతదడ వీ సతిని
కన్నె నింత గిజిగిజిగాఁ జేతురా
(॥ఎన్న॥)
చెంపల కుడులు జారె చెమట నిండా నూరె
అంపలేవు చెలి నింకా నలవిలేదా
ఇంపున దొమతెరలో నింత దడవుసేసితి
సొంపుల మమ్మీకెమోము చూడనీరాదా
(॥ఎన్న॥)
నిలువెల్లఁ బులకించె నిట్టూర్పు విఁమ్మి రేఁగె
అలమి పైఁ జేయివేసే వాసోదమా
నిలువుల మేడమీఁద నిన్న నెల్లా నుండితివి
కలికిని వమాఇంటిదాఁకా రానీరాదా
(॥ఎన్న॥)
కన్నుల నిద్దుర దేరీ కందువ పయ్యద జారీ
అన్నువఁ దొడపైఁ బండే వది యేమయ్య
పన్నినశ్రీవేంకటాద్రిపతి వింతి నురముపై
వున్నతి నిడుకొంటివి వొద్ద నుండేమయ్యా
(||pallavi||)
ĕnnam̐ḍu dānĕṟam̐gamu yiṁtadaḍa vī sadini
kannĕ niṁta gijigijigām̐ jedurā
(||ĕnna||)
sĕṁpala kuḍulu jārĕ sĕmaḍa niṁḍā nūrĕ
aṁpalevu sĕli niṁkā nalaviledā
iṁpuna dŏmadĕralo niṁta daḍavusesidi
sŏṁpula mammīgĕmomu sūḍanīrādā
(||ĕnna||)
niluvĕllam̐ bulagiṁchĕ niṭṭūrbu vim̐mmi rem̐gĕ
alami paim̐ jeyivese vāsodamā
niluvula meḍamīm̐da ninna nĕllā nuṁḍidivi
kaligini vamāiṁṭidām̐kā rānīrādā
(||ĕnna||)
kannula niddura derī kaṁduva payyada jārī
annuvam̐ dŏḍabaim̐ baṁḍe vadi yemayya
panninaśhrīveṁkaḍādribadi viṁti nuramubai
vunnadi niḍugŏṁṭivi vŏdda nuṁḍemayyā