Ennadu nerusugomti vinnesi neevu

ఎన్నడు నేరుచుకొంటి విన్నేసి నీవు
Language

(॥పల్లవి॥)
ఎన్నడు నేరుచుకొంటి విన్నేసి నీవు
వన్నెల నాతని నింత వలపించుకొంటివే

(॥ఎన్న॥)
చెక్కునొక్కి మాటలాడి చెలువుని సారెసారె
యిక్కువలు గరఁగించి యెంతసేసేవే
మొక్కు మొక్కి నిలుచుండి మోవితేనె చవిచూపి
యెక్కడెక్కడ ప్రియాలేమిచెప్పేవే

(॥ఎన్న॥)
సెలవుల నవ్వునవ్వి చెనకుచుఁ జిమ్మిరేఁచి
యెలయింపులఁ జేతల నీ వెంత సేసేవే
సొలపుఁగన్నుల జూచి సొరిదిఁ గానుక లిచ్చి
యెలుఁగెత్తి పాటలు నీ వేమివినిపించేవే

(॥ఎన్న॥)
విడెమిచ్చి జాగరాలు వేగినంతాఁ జేసిసేసి
యెడయక వలపించి యెంతసేసేవే
అడరి శ్రీవేంకటేశుఁ డాదరించి నిన్నుఁ గూడె
యెడనెడ రతుల నీ వేలీల భోగించేవే

(||pallavi||)
ĕnnaḍu nerusugŏṁṭi vinnesi nīvu
vannĕla nādani niṁta valabiṁchugŏṁṭive

(||ĕnna||)
sĕkkunŏkki māḍalāḍi sĕluvuni sārĕsārĕ
yikkuvalu garam̐giṁchi yĕṁtaseseve
mŏkku mŏkki nilusuṁḍi movidenĕ savisūbi
yĕkkaḍĕkkaḍa priyālemisĕppeve

(||ĕnna||)
sĕlavula navvunavvi sĕnagusum̐ jimmirem̐si
yĕlayiṁpulam̐ jedala nī vĕṁta seseve
sŏlabum̐gannula jūsi sŏridim̐ gānuga lichchi
yĕlum̐gĕtti pāḍalu nī vemivinibiṁcheve

(||ĕnna||)
viḍĕmichchi jāgarālu veginaṁtām̐ jesisesi
yĕḍayaga valabiṁchi yĕṁtaseseve
aḍari śhrīveṁkaḍeśhum̐ ḍādariṁchi ninnum̐ gūḍĕ
yĕḍanĕḍa radula nī velīla bhogiṁcheve