Emtimaamta yeduladeemta

ఏఁటిమాఁట యేదులతీఁట
Language

(॥పల్లవి॥)
ఏఁటిమాఁట యేదులతీఁట
జీటకపువాని సుద్ది చెప్పకురే మీరు

(॥ఏటి॥)
కన్నులఁ దప్పకచూచు కాఁకసేసి తలతీసు
సన్నలఁ బెక్కులు దవ్వు సారెసారె నవ్వును
కన్నెనాఁడే వీనిచేఁత కంటిమి వింటిమి నాతో
యెన్ననేలే వీనిసుద్దు లెంచకురే మీరు

(॥ఏటి॥)
ఆడుగులో మోసపుచ్చు నలుగు నేమిటికైన
పడఁతి నలమిపట్టు పలువుర నంటును
వడిపడి వేసరితి పనిలే దంతేసిదూర
యెడనెడ వీనిగుణా లెంచకురే మీరు

(॥ఏటి॥)
మానములు గోలుపుచ్చు మారులేక కాలుదొక్కు
మోసమున నంతలోన మొక్కు మొక్కుమనును
యీనిజము శ్రీవేంకటేశునికిఁ గలజాడ
యే నెఱుఁగుదును ఇఁక నెంచకురే మీరు

(||pallavi||)
em̐ṭimām̐ṭa yeduladīm̐ṭa
jīḍagabuvāni suddi sĕppagure mīru

(||eḍi||)
kannulam̐ dappagasūsu kām̐kasesi taladīsu
sannalam̐ bĕkkulu davvu sārĕsārĕ navvunu
kannĕnām̐ḍe vīnisem̐ta kaṁṭimi viṁṭimi nādo
yĕnnanele vīnisuddu lĕṁchagure mīru

(||eḍi||)
āḍugulo mosabuchchu nalugu nemiḍigaina
paḍam̐ti nalamibaṭṭu paluvura naṁṭunu
vaḍibaḍi vesaridi panile daṁtesidūra
yĕḍanĕḍa vīniguṇā lĕṁchagure mīru

(||eḍi||)
mānamulu golubuchchu mārulega kāludŏkku
mosamuna naṁtalona mŏkku mŏkkumanunu
yīnijamu śhrīveṁkaḍeśhunigim̐ galajāḍa
ye nĕṟum̐gudunu im̐ka nĕṁchagure mīru