ఏఁటికిఁ బరాకుసేసే విప్పుడు నీవు
(॥పల్లవి॥)
ఏఁటికిఁ బరాకుసేసే విప్పుడు నీవు
మాఁట లాడి ఇఁకనైనా మన్నించరాదా
(॥॥)
చిమ్ముఁజూపులనుఁ జూచి చేతికిచ్చీ పూబంతి
కొమ్మ నీకు నిదె యందుకొనరాదా
వుమ్మగిలఁ జెమరించి వూరకే నీవుండఁగాను
ఇమ్మిచ్చి తొడమీఁదట నిడుకొనరాదా
(॥॥)
వినయాన నీకు మొక్కి విందుచెప్పవచ్చెఁ జెలి
గునియక యిట్టె ఇయ్యకొనరాదా
నినుపునిట్టూర్పు నించీ నీవు గుట్టుతో నుండఁగా
చనవిచ్చి చెక్కు నొక్కి సమ్మతించరాదా
(॥॥)
కొంగువట్టి పానుపుపై కూచుండఁ బెట్టీ నిన్ను
ఇంగిత మెరిఁగి మోవి ఇయ్యరాదా
చెంగలించి రతిఁగూడి శ్రీ వేంకటేశ మెప్పించె-
నంగన నెప్పుడు నిట్టె ఆదరించరాదా
(||pallavi||)
em̐ṭigim̐ barāgusese vippuḍu nīvu
mām̐ṭa lāḍi im̐kanainā manniṁcharādā
(||||)
simmum̐jūbulanum̐ jūsi sedigichchī pūbaṁti
kŏmma nīgu nidĕ yaṁdugŏnarādā
vummagilam̐ jĕmariṁchi vūrage nīvuṁḍam̐gānu
immichchi tŏḍamīm̐daḍa niḍugŏnarādā
(||||)
vinayāna nīgu mŏkki viṁdusĕppavachchĕm̐ jĕli
guniyaga yiṭṭĕ iyyagŏnarādā
ninubuniṭṭūrbu niṁchī nīvu guṭṭudo nuṁḍam̐gā
sanavichchi sĕkku nŏkki sammadiṁcharādā
(||||)
kŏṁguvaṭṭi pānububai kūsuṁḍam̐ bĕṭṭī ninnu
iṁgida mĕrim̐gi movi iyyarādā
sĕṁgaliṁchi radim̐gūḍi śhrī veṁkaḍeśha mĕppiṁchĕ-
naṁgana nĕppuḍu niṭṭĕ ādariṁcharādā