(॥పల్లవి॥)
ఏఁటికిఁ బరాకు లిఁక నీకు
కోటి సేసునిదె కోమలి వలపు
(॥ఏఁటి॥)
వినవయ్యా నా విన్నపము
మునుకొని నీకిదె మొక్కెనూ
పెనఁగకు సతి నినుఁ బిలిచీని
యెనయఁ బనులు నీ కెన్నైనఁ గలవూ
(॥ఏఁటి॥)
యియ్యవయా తనవిఁక నాకూ
యియ్యెడఁ గానుక లిచ్చేనూ
చెయ్యార సన్నలు సేసీఁ జెలి
నెయ్యము చూపఁగ నీ కిది వేళా
(॥ఏఁటి॥)
పలుకవయాతప్పక నాతో
నెలకొని వేఁడుకొనే నిన్నునూ
వెలఁది యేలితివి శ్రీ వేంకటేశుఁడా
యిల నీపంతము లీడేరె నిపుడూ
(||pallavi||)
em̐ṭigim̐ barāgu lim̐ka nīgu
koḍi sesunidĕ komali valabu
(||em̐ṭi||)
vinavayyā nā vinnabamu
munugŏni nīgidĕ mŏkkĕnū
pĕnam̐gagu sadi ninum̐ bilisīni
yĕnayam̐ banulu nī kĕnnainam̐ galavū
(||em̐ṭi||)
yiyyavayā tanavim̐ka nāgū
yiyyĕḍam̐ gānuga lichchenū
sĕyyāra sannalu sesīm̐ jĕli
nĕyyamu sūbam̐ga nī kidi veḽā
(||em̐ṭi||)
palugavayādappaga nādo
nĕlagŏni vem̐ḍugŏne ninnunū
vĕlam̐di yelidivi śhrī veṁkaḍeśhum̐ḍā
yila nībaṁtamu līḍerĕ nibuḍū