ఏఁటికిఁ బంతాలాడేవు యిప్పుడు మాతో
(॥పల్లవి॥)
ఏఁటికిఁ బంతాలాడేవు యిప్పుడు మాతో
గాఁటపు నీ బలిమెల్లాఁ గానవచ్చీ నిపుడే
(॥ఏటి॥)
మచ్చిక నీకాఁగిటికి మనసు పెట్టినయాకె
కొచ్చి కొచ్చి యెప్పుడునుఁ గూడకుండీనా
కచ్చుపెట్టి సారెసారెఁ గానుకలిచ్చిన యాపె
చొచ్చి చుట్టరికమెల్లాఁ జూపకుండీనా
(॥ఏటి॥)
చలముమెరసి నీతో సన్నలు చేసిన యాపె
సులభాన మోవి చవిచూడకండీనా
వలపులు నీ మీఁద వదలకు చల్లినాపె
చలివాయ నీపైఁ జేయి చాఁచకుండీనా
(॥ఏటి॥)
ననుపున నీ వద్ద నవ్వులు నవ్వినయాపె
అనువుగా నిన్నుఁ బెండ్లియాడకుండీనా
యెనసితి విటు నన్ను యిదివో శ్రీవేంకటేశ
కొనగొలనే తానూఁ గొసరకుండీనా
(||pallavi||)
em̐ṭigim̐ baṁtālāḍevu yippuḍu mādo
gām̐ṭabu nī balimĕllām̐ gānavachchī nibuḍe
(||eḍi||)
machchiga nīgām̐giḍigi manasu pĕṭṭinayāgĕ
kŏchchi kŏchchi yĕppuḍunum̐ gūḍaguṁḍīnā
kachchubĕṭṭi sārĕsārĕm̐ gānugalichchina yābĕ
sŏchchi suṭṭarigamĕllām̐ jūbaguṁḍīnā
(||eḍi||)
salamumĕrasi nīdo sannalu sesina yābĕ
sulabhāna movi savisūḍagaṁḍīnā
valabulu nī mīm̐da vadalagu sallinābĕ
salivāya nībaim̐ jeyi sām̐saguṁḍīnā
(||eḍi||)
nanubuna nī vadda navvulu navvinayābĕ
anuvugā ninnum̐ bĕṁḍliyāḍaguṁḍīnā
yĕnasidi viḍu nannu yidivo śhrīveṁkaḍeśha
kŏnagŏlane tānūm̐ gŏsaraguṁḍīnā