Emtigim baatlam badeveme neevu

ఏఁటికిఁ బాట్లఁ బడేవేమే నీవు
Language

(॥పల్లవి॥)
ఏఁటికిఁ బాట్లఁ బడేవేమే నీవు
కూటసాక్షులకే నీవు గురియైతివో

(॥ఏటి॥)
వొద్దనుం డాతనికిఁగా వొలపక్షమాడేవు
గద్దించేవు నీకుఁ గొంత గలదో పొందు
అద్దుక సన్నలుసేసి ఆతనిచే మొక్కించేవు
బుద్దితో వలపులపొత్తు నీకు నబ్బెనో

(॥ఏటి॥)
వూరకైనాఁ బతికిఁగా వొడఁబరచవచ్చేవు
నేరము లేమైనను నిన్ను సోఁకేనో
తీరిచి ఆనేరములు తిద్ది తిద్ది చెప్పేవు
పోరచితనాన నీకు పూఁటలంటెనో

(॥ఏటి॥)
గక్కన శ్రీవేంకటేశుఁ గాఁగిలింపించేవు నన్ను
చక్కనిరతులు నీకుఁ జవివుట్టేనో
చొక్కేవు ఆకుమడిచి సోఁక నీవు అందిచ్చి
నిక్కి నిక్కి సంతోసాలు నీమీఁద జారెనో

(||pallavi||)
em̐ṭigim̐ bāṭlam̐ baḍeveme nīvu
kūḍasākṣhulage nīvu guriyaidivo

(||eḍi||)
vŏddanuṁ ḍādanigim̐gā vŏlabakṣhamāḍevu
gaddiṁchevu nīgum̐ gŏṁta galado pŏṁdu
adduga sannalusesi ādanise mŏkkiṁchevu
buddido valabulabŏttu nīgu nabbĕno

(||eḍi||)
vūragainām̐ badigim̐gā vŏḍam̐barasavachchevu
neramu lemainanu ninnu som̐keno
tīrisi āneramulu tiddi tiddi sĕppevu
porasidanāna nīgu pūm̐ṭalaṁṭĕno

(||eḍi||)
gakkana śhrīveṁkaḍeśhum̐ gām̐giliṁpiṁchevu nannu
sakkaniradulu nīgum̐ javivuṭṭeno
sŏkkevu āgumaḍisi som̐ka nīvu aṁdichchi
nikki nikki saṁtosālu nīmīm̐da jārĕno