Emtigi veraguvade veṟamganivaanivale

ఏఁటికి వెరగువడే వెఱఁగనివానివలె
Language

(॥పల్లవి॥)
ఏఁటికి వెరగువడే వెఱఁగనివానివలె
చాటిచెప్పి సణఁగులు చల్లనా నేను

(॥ఏంటి॥)
మంతనాన మీరిద్దరు మాటలాడుకొనఁగాను
వింతలుగా వీనులార విననా నేను
యింత సేసితినిసుమ్మీ ఇఁక లేదనుకుమని
చెంతనుండి నీకెఱఁగ జెప్పనా నేను

(॥ఏఁటి॥)
యెనసి నీవో నాకె ఇట్టె కాఁగిలించుకోఁగా
ననుపులు(ల?) మిమ్ముఁ జూచి నవ్వనా నేను
కనుఁగొంటగిఁజుమ్మీ మీతగవు మఱవకుమని
వొనర నీచెక్కు నొక్కనా నేను

(॥ఏఁటి॥)
వోవరిలో మోవితేనె లొకరొక రిచ్చుకోఁగా
మీవద్దనే కూచుండి మెచ్చనా నేను
శ్రీవేంకటేశుఁడవు జిగి నలమేల్మంగను
చేవదేరఁ గూడి సేవసేయనా నేను

(||pallavi||)
em̐ṭigi vĕraguvaḍe vĕṟam̐ganivānivalĕ
sāḍisĕppi saṇam̐gulu sallanā nenu

(||eṁṭi||)
maṁtanāna mīriddaru māḍalāḍugŏnam̐gānu
viṁtalugā vīnulāra vinanā nenu
yiṁta sesidinisummī im̐ka ledanugumani
sĕṁtanuṁḍi nīgĕṟam̐ga jĕppanā nenu

(||em̐ṭi||)
yĕnasi nīvo nāgĕ iṭṭĕ kām̐giliṁchugom̐gā
nanubulu(la?) mimmum̐ jūsi navvanā nenu
kanum̐gŏṁṭagim̐jummī mīdagavu maṟavagumani
vŏnara nīsĕkku nŏkkanā nenu

(||em̐ṭi||)
vovarilo movidenĕ lŏgarŏga richchugom̐gā
mīvaddane kūsuṁḍi mĕchchanā nenu
śhrīveṁkaḍeśhum̐ḍavu jigi nalamelmaṁganu
sevaderam̐ gūḍi sevaseyanā nenu