ఏఁటికి ననుమానము యెందాఁకాను
(॥పల్లవి॥)
ఏఁటికి ననుమానము యెందాఁకాను
కూటమిగలచోటికి గుట్టు సేయగలదు
(॥ఏఁటి॥)
వరుసకు నాపె నేఁడు వచ్చెఁగా నీవద్దికి
వెరవేది లోపలికి విచ్చేయరాదా
పరగ నాపై వలపు పండి పొల్లవోయీనా
దొరాపాటివికి దోసమే లేదు
(॥ఏఁటి॥)
ఆసతో నీమోము చూచీ నదివో యీ జవరాలు
సేసవెట్టి పెండ్లాడి చేకొనరాదా
బాసలు నాకిచ్చితేనే పరిసిపోయీనా
ఆసరిఁ గోడెకానికి నంటుముట్టు లేదు
(॥ఏఁటి॥)
పొరుగుపోరచి వచ్చి పొలసీ నీనేస్తగత్తె
గరిమ నీ పచ్చడము గప్పఁగరాదా
యిరవై శ్రీవేంకటేశ యెనసితి విటు నన్ను
సిరులుగలవానికి చింతించఁదగదు
(||pallavi||)
em̐ṭigi nanumānamu yĕṁdām̐kānu
kūḍamigalasoḍigi guṭṭu seyagaladu
(||em̐ṭi||)
varusagu nābĕ nem̐ḍu vachchĕm̐gā nīvaddigi
vĕravedi lobaligi vichcheyarādā
paraga nābai valabu paṁḍi pŏllavoyīnā
dŏrābāḍivigi dosame ledu
(||em̐ṭi||)
āsado nīmomu sūsī nadivo yī javarālu
sesavĕṭṭi pĕṁḍlāḍi segŏnarādā
bāsalu nāgichchidene parisiboyīnā
āsarim̐ goḍĕgānigi naṁṭumuṭṭu ledu
(||em̐ṭi||)
pŏruguborasi vachchi pŏlasī nīnestagattĕ
garima nī pachchaḍamu gappam̐garādā
yiravai śhrīveṁkaḍeśha yĕnasidi viḍu nannu
sirulugalavānigi siṁtiṁcham̐dagadu