Emtigi mee gujaguja leramgaraadu

ఏఁటికి మీ గుజగుజ లెరఁగరాదు
Language

(॥పల్లవి॥)
ఏఁటికి మీ గుజగుజ లెరఁగరాదు
తేటపరచఁగరాదా దిద్దేము తగవు

(॥॥)
సొలపులమాటలాడి చూపుల నిన్నుఁ గొసరి
తలుపుమాటున నుండి తమకించీని
చెలియ నేమిటి కింతసేసితివి యిటువలె
తెలియఁ జెప్పఁగరాదా దిద్దేము తగవు

(॥॥)
వెక్కసాలు నీకుఁ జూపి వేడుకలు నీపైఁ జల్లి
వక్కణలు నిన్నడిగి వద్దనే వుండీ
అక్కరపడ్డకాంతలనే అలయించే విటువలె
దిక్కయి మమ్మడుగరాదా దిద్దేము తగవు

(॥॥)
తరితీపు నీకుఁ జేసి తడవి యలమేల్మంగ
వరుస నిన్నుఁ గూడి నీవద్దనే వుండీ
సరి శ్రీ వేంకటేశుఁడ సతి నెంత వొరనేవు
తెరవేసుకొనరాదా దిద్దేము తగవు

(||pallavi||)
em̐ṭigi mī gujaguja lĕram̐garādu
teḍabarasam̐garādā diddemu tagavu

(||||)
sŏlabulamāḍalāḍi sūbula ninnum̐ gŏsari
talubumāḍuna nuṁḍi tamagiṁchīni
sĕliya nemiḍi kiṁtasesidivi yiḍuvalĕ
tĕliyam̐ jĕppam̐garādā diddemu tagavu

(||||)
vĕkkasālu nīgum̐ jūbi veḍugalu nībaim̐ jalli
vakkaṇalu ninnaḍigi vaddane vuṁḍī
akkarabaḍḍagāṁtalane alayiṁche viḍuvalĕ
dikkayi mammaḍugarādā diddemu tagavu

(||||)
taridību nīgum̐ jesi taḍavi yalamelmaṁga
varusa ninnum̐ gūḍi nīvaddane vuṁḍī
sari śhrī veṁkaḍeśhum̐ḍa sadi nĕṁta vŏranevu
tĕravesugŏnarādā diddemu tagavu