Emtigi maa maamta lidameeda

ఏఁటికి మా మాఁట లిటమీద
Language

(॥పల్లవి॥)
ఏఁటికి మా మాఁట లిటమీద
మేఁటి సరసముల మెరసితి రిపుడే

(॥ఏఁటి॥)
కలికి నినుఁ గలయఁ గట్టెను తొలుతనె
పలచని నగవుల బాసికము
నిలువున నీవును నించఁగఁ గైకొనె
సొలపులచూపులసూసకము

(॥ఏఁటి॥)
యింతి పెదవులనె యిచ్చెను నీకును
వింతగాఁ బెండ్లివిడేలు
సంతసవు మలవు చల్లఁగఁ గైకొనె
యింతటఁ బులకల నివె తలఁబాలు

(॥ఏఁటి॥)
భోగపురతులనె బువ్వము దొడికెను
చేఁగలసిగ్గులే చిలుపాలు
యీగతి శ్రీ వేంకటేశుఁడ కూడితి
బాగుగా సోబానఁ బాడేము నేము

(||pallavi||)
em̐ṭigi mā mām̐ṭa liḍamīda
mem̐ṭi sarasamula mĕrasidi ribuḍe

(||em̐ṭi||)
kaligi ninum̐ galayam̐ gaṭṭĕnu tŏludanĕ
palasani nagavula bāsigamu
niluvuna nīvunu niṁcham̐gam̐ gaigŏnĕ
sŏlabulasūbulasūsagamu

(||em̐ṭi||)
yiṁti pĕdavulanĕ yichchĕnu nīgunu
viṁtagām̐ bĕṁḍliviḍelu
saṁtasavu malavu sallam̐gam̐ gaigŏnĕ
yiṁtaḍam̐ bulagala nivĕ talam̐bālu

(||em̐ṭi||)
bhogaburadulanĕ buvvamu dŏḍigĕnu
sem̐galasiggule silubālu
yīgadi śhrī veṁkaḍeśhum̐ḍa kūḍidi
bāgugā sobānam̐ bāḍemu nemu