Emtigi gelisesevu imdari mumdaraa mammu

ఏఁటికి గేలిసేసేవు ఇందరి ముందరా మమ్ము
Language

(॥పల్లవి॥)
ఏఁటికి గేలిసేసేవు ఇందరి ముందరా మమ్ము
గాఁటాన నవ్వఁ దడవా కాదనికాక

(॥ఏఁటి॥)
జంకెనచూపుల నిన్ను సాదించఁదడవా
మంకుఁదన మేఁటికనేమాటకుఁగాక
కంకణాలచేయి వేసి కాకురేఁచఁ దడవా
అంకెల నాఁటది గబ్బియందురనికాక

(॥ఏఁటి॥)
వలపించి నిన్ను నిట్టె వంచుకొనఁదడవా
చలమరి ఇదియనేసడికిఁగాక
పెలుఁదనాన నీతో పెనఁగఁగఁ దడవా
యిల నాలుమగఁడనే యెన్నికకుఁ గాక

(॥ఏఁటి॥)
పంతములు నీతోను పచరించఁ దడవా
ఇంతరట్టు సేసేది యేలనికాక
చెంత నన్నుఁ గూడితివి శ్రీవేంకటేశుఁడ
యెంతైనా మెచ్చఁదడవా యెమ్మెలని కాక

(||pallavi||)
em̐ṭigi gelisesevu iṁdari muṁdarā mammu
gām̐ṭāna navvam̐ daḍavā kādanigāga

(||em̐ṭi||)
jaṁkĕnasūbula ninnu sādiṁcham̐daḍavā
maṁkum̐dana mem̐ṭiganemāḍagum̐gāga
kaṁkaṇālaseyi vesi kāgurem̐sam̐ daḍavā
aṁkĕla nām̐ṭadi gabbiyaṁduranigāga

(||em̐ṭi||)
valabiṁchi ninnu niṭṭĕ vaṁchugŏnam̐daḍavā
salamari idiyanesaḍigim̐gāga
pĕlum̐danāna nīdo pĕnam̐gam̐gam̐ daḍavā
yila nālumagam̐ḍane yĕnnigagum̐ gāga

(||em̐ṭi||)
paṁtamulu nīdonu pasariṁcham̐ daḍavā
iṁtaraṭṭu sesedi yelanigāga
sĕṁta nannum̐ gūḍidivi śhrīveṁkaḍeśhum̐ḍa
yĕṁtainā mĕchcham̐daḍavā yĕmmĕlani kāga