ఏఁటికి దాఁచే వింద రెరిఁగిన పనులివి
(॥పల్లవి॥)
ఏఁటికి దాఁచే వింద రెరిఁగిన పనులివి
నీటుతో నానతియ్యవయ్య నీవు నాతోను
(॥ఏఁటి॥)
గక్కన నవ్వు నవ్వి కానుకిచ్చె నీ కాపె
యెక్కడి సుద్దులయ్యా ఇద్దరికిని
మొక్కుమొక్కి చెవిలోన ముచ్చట విన్నవించెను
నిక్క మాన తియ్యవయ్యా నీవు నాతోను
(॥ఏఁటి॥)
సళుపుఁజూపు చూచి సన్నసేసె నీకాపె
మెలుపు లెట్టివయ్య మీలోనను
పిలిచి పేరుకొన పెదవులు గదలించె
నలి చాన తియ్యవయ్య నీవు నాతోన
(॥ఏఁటి॥)
కొంగువట్టి తీసి నీకు గురుతులు దలఁపించె
సంగ తెటువంటిదయ్య సరస మీకు
అంగపు శ్రీవేంకటేశ అలమేలుమంగను నే
యింగిత మాన తీవయ్య యిట్టె నాతోను
(||pallavi||)
em̐ṭigi dām̐se viṁda rĕrim̐gina panulivi
nīḍudo nānadiyyavayya nīvu nādonu
(||em̐ṭi||)
gakkana navvu navvi kānugichchĕ nī kābĕ
yĕkkaḍi suddulayyā iddarigini
mŏkkumŏkki sĕvilona muchchaḍa vinnaviṁchĕnu
nikka māna tiyyavayyā nīvu nādonu
(||em̐ṭi||)
saḽubum̐jūbu sūsi sannasesĕ nīgābĕ
mĕlubu lĕṭṭivayya mīlonanu
pilisi perugŏna pĕdavulu gadaliṁchĕ
nali sāna tiyyavayya nīvu nādona
(||em̐ṭi||)
kŏṁguvaṭṭi tīsi nīgu gurudulu dalam̐piṁchĕ
saṁga tĕḍuvaṁṭidayya sarasa mīgu
aṁgabu śhrīveṁkaḍeśha alamelumaṁganu ne
yiṁgida māna tīvayya yiṭṭĕ nādonu