Emtigi anumaanamu liddarunu nilusumdi

ఏఁటికి అనుమానము లిద్దరును నిలుచుండి
Language

(॥పల్లవి॥)
ఏఁటికి అనుమానము లిద్దరును నిలుచుండి
కూటములు గూడితే మీ గుణమే సుఖము

(॥ఏటి॥)
నేరుపు గలిగితేను నెపము లెంచకుండితే
ఆరితేరకుండినా మోహము సుఖము
బీరములు నెరపక ప్రియములే ఆడితేను
వారించరానియట్టివయసే సుఖము

(॥ఏటి॥)
యెరవులులేక మరి యియ్యకోళ్లే కలితేను
గొరబుగానియట్టిసిగ్గులే సుఖము
కరఁగినమనసులై కైవశము లయితేను
సిరులమించినయట్టి చెనకులే సుఖము

(॥ఏటి॥)
చనవులు మెరిసితే జగడాలు దీరితేను
తవివోనిరతులే సంతతసుఖము
యెనసితిరి శ్రీవేంకటేశ మీరిద్దరును
ననుపులతోడిమీలో నగవులే సుఖము

(||pallavi||)
em̐ṭigi anumānamu liddarunu nilusuṁḍi
kūḍamulu gūḍide mī guṇame sukhamu

(||eḍi||)
nerubu galigidenu nĕbamu lĕṁchaguṁḍide
ārideraguṁḍinā mohamu sukhamu
bīramulu nĕrabaga priyamule āḍidenu
vāriṁcharāniyaṭṭivayase sukhamu

(||eḍi||)
yĕravululega mari yiyyagoḽle kalidenu
gŏrabugāniyaṭṭisiggule sukhamu
karam̐ginamanasulai kaivaśhamu layidenu
sirulamiṁchinayaṭṭi sĕnagule sukhamu

(||eḍi||)
sanavulu mĕriside jagaḍālu dīridenu
tavivoniradule saṁtadasukhamu
yĕnasidiri śhrīveṁkaḍeśha mīriddarunu
nanubuladoḍimīlo nagavule sukhamu