ఏఁటిదే మా వలపు యింతా నీదే వలపు
(॥పల్లవి॥)
ఏఁటిదే మా వలపు యింతా నీదే వలపు
రోఁటితేఁ బదియుఁ బది రొక్కమాయ వలపు
(॥ఏఁటి॥)
నిట్ట చూపులై నీకు నిండుకొనె వలపు
ముట్టి వచ్చితే పెద్ద మోపాయ వలపు
అట్టె గొరసరాయఁ డాయగా నీవలపు
నట్టుక కంబముమాఁటు నవ్వులాయ వలపు
(॥ఏఁటి॥)
బూమి మీఁద వేఁడుకొంటే పొడవాయ వలపు
గోమున నొరసితేను కోపమాయ వలపు
వేమారు నడవులెల్ల వెదకించె వలపు
ఆముకొని గొల్లదోమటాయ నదె వలపు
(॥ఏఁటి॥)
వింతవారెదుట సిగ్గు విడిపించె వలపు
బంతినే వచ్చి రాతికిఁ బ్రాణమాయ వలపు
పంతము నీవియ్యఁగా మాపాలాయ వలపు
కాంతుఁడ శ్రీ వేంకటేశ కప్పెను నీవలపు
(||pallavi||)
em̐ṭide mā valabu yiṁtā nīde valabu
rom̐ṭidem̐ badiyum̐ badi rŏkkamāya valabu
(||em̐ṭi||)
niṭṭa sūbulai nīgu niṁḍugŏnĕ valabu
muṭṭi vachchide pĕdda mobāya valabu
aṭṭĕ gŏrasarāyam̐ ḍāyagā nīvalabu
naṭṭuga kaṁbamumām̐ṭu navvulāya valabu
(||em̐ṭi||)
būmi mīm̐da vem̐ḍugŏṁṭe pŏḍavāya valabu
gomuna nŏrasidenu kobamāya valabu
vemāru naḍavulĕlla vĕdagiṁchĕ valabu
āmugŏni gŏlladomaḍāya nadĕ valabu
(||em̐ṭi||)
viṁtavārĕduḍa siggu viḍibiṁchĕ valabu
baṁtine vachchi rādigim̐ brāṇamāya valabu
paṁtamu nīviyyam̐gā mābālāya valabu
kāṁtum̐ḍa śhrī veṁkaḍeśha kappĕnu nīvalabu