Emtibuddulu seppere imtulaala

ఏఁటిబుద్దులు చెప్పేరే ఇంతులాల
Language

(॥పల్లవి॥)
ఏఁటిబుద్దులు చెప్పేరే ఇంతులాల
మాఁటువెట్ట కాతనికే మారుమాట చెప్పరే

(॥ఏటి॥)
మంతనాన వారిద్దరూ మాటలాడుకొనఁగాను
దొంతివలపు దొమటిదొడుకఁగాను
వింతగా నాతనికి నే విడెమెట్లా నిత్తునే
చెంతనుండి వూడిగాలు సేయ నెట్ట వచ్చునే

(॥ఏటి॥)
పానువు పై నుండి తాము పచ్చిదేర నవ్వఁగాను
ఆనుక లోలో సరసాలాడఁగాను
వీనుల సిగ్గువడక విననెట్టు దగునే
పానిపట్టుకొని యెట్టు పాదము లొత్తుదనే

(॥ఏటి॥)
జగిమించ నొండొరులు చెనకి పెనఁగఁగాను
నిగిడి సిగ్గు దమకు నిండుకోఁగాను
తగ శ్రీవేంకటేశుఁడు తానే వచ్చినన్నుఁ గూడె
తగిలి యప్పటి నెట్టు తమకము రేఁతునే

(||pallavi||)
em̐ṭibuddulu sĕppere iṁtulāla
mām̐ṭuvĕṭṭa kādanige mārumāḍa sĕppare

(||eḍi||)
maṁtanāna vāriddarū māḍalāḍugŏnam̐gānu
dŏṁtivalabu dŏmaḍidŏḍugam̐gānu
viṁtagā nādanigi ne viḍĕmĕṭlā nittune
sĕṁtanuṁḍi vūḍigālu seya nĕṭṭa vachchune

(||eḍi||)
pānuvu pai nuṁḍi tāmu pachchidera navvam̐gānu
ānuga lolo sarasālāḍam̐gānu
vīnula sigguvaḍaga vinanĕṭṭu dagune
pānibaṭṭugŏni yĕṭṭu pādamu lŏttudane

(||eḍi||)
jagimiṁcha nŏṁḍŏrulu sĕnagi pĕnam̐gam̐gānu
nigiḍi siggu damagu niṁḍugom̐gānu
taga śhrīveṁkaḍeśhum̐ḍu tāne vachchinannum̐ gūḍĕ
tagili yappaḍi nĕṭṭu tamagamu rem̐tune