ఏఁటి మాట లాడీనే యెందాఁకా వీఁడు
(॥పల్లవి॥)
ఏఁటి మాట లాడీనే యెందాఁకా వీఁడు
నటున నేఁ దన కంత నేరుపేటిదాననా
(॥ఏటి॥)
కలయనికాఁకలను కడునెంత పొరలినా
వలపు వెంచవచ్చునా వనితలకు
నిలువునఁ దమకము నిండుక యెంతవుండినా
వెలినున్నసిగ్గులెల్లా విడువఁగవచ్చునా
(॥ఏటి॥)
రాయడిపడక యంతరాణివాసమై వుండినా
పాయము దాఁచవచ్చునా పడఁతులకు
యేయడఁ దనకు వాసు లెంతగలిగివుండినా
కాయముపైఁ గళలెల్లాఁ గప్పఁగవచ్చునా
(॥ఏటి॥)
అనిశము మీఁద మీఁద నతి రాజసమై వుండినా
మనసీకుండవచ్చునా మగువలకు
యెనసె శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్ను నేఁడు
వెనకముందులు మరి వేరే యెంచవచ్చునా
(||pallavi||)
em̐ṭi māḍa lāḍīne yĕṁdām̐kā vīm̐ḍu
naḍuna nem̐ dana kaṁta nerubeḍidānanā
(||eḍi||)
kalayanigām̐kalanu kaḍunĕṁta pŏralinā
valabu vĕṁchavachchunā vanidalagu
niluvunam̐ damagamu niṁḍuga yĕṁtavuṁḍinā
vĕlinunnasiggulĕllā viḍuvam̐gavachchunā
(||eḍi||)
rāyaḍibaḍaga yaṁtarāṇivāsamai vuṁḍinā
pāyamu dām̐savachchunā paḍam̐tulagu
yeyaḍam̐ danagu vāsu lĕṁtagaligivuṁḍinā
kāyamubaim̐ gaḽalĕllām̐ gappam̐gavachchunā
(||eḍi||)
aniśhamu mīm̐da mīm̐da nadi rājasamai vuṁḍinā
manasīguṁḍavachchunā maguvalagu
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannu nem̐ḍu
vĕnagamuṁdulu mari vere yĕṁchavachchunā