Emti jaanadaname yevvaru metture yidi

ఏఁటి జాణతనమే యెవ్వరు మెత్తురే యిది
Language

(॥పల్లవి॥)
ఏఁటి జాణతనమే యెవ్వరు మెత్తురే యిది
తేటలనే మగవానిఁ దేలించఁగదవే

(॥ఏఁటి॥)
కలికితనాలఁ బతిఁ గరఁగించవలెఁగాక
బలిమిసేయఁగఁబోతే పచ్చిదేరదా
చెలిమి పొందుగఁ జేసి చిక్కించుకొంటఁగాక
వలవని సణఁగుల వలపించవచ్చునా

(॥ఏఁటి॥)
ఇచ్చకపుఁజేఁతలనే యెలయించవలెఁగాక
పెచ్చురేఁగి కొసరితేఁ బిప్పిగట్టదా
మచ్చికతోఁ బానుపుపై మరిగించుకొంటఁగాక
రచ్చలోనఁ బెనఁగితే రతి సమకూడునా

(॥ఏఁటి॥)
సొరిది గుబ్బల నొత్తి చొక్కించవలెఁగాక
గరువానఁ గూడితేను గరివడదా
కరుణించి శ్రీవేంకటేశుఁడే నిన్ను నేలె
వొరసిట్టె పైకొంటేను వొక్కటౌనా మనసు

(||pallavi||)
em̐ṭi jāṇadaname yĕvvaru mĕtture yidi
teḍalane magavānim̐ deliṁcham̐gadave

(||em̐ṭi||)
kaligidanālam̐ badim̐ garam̐giṁchavalĕm̐gāga
balimiseyam̐gam̐bode pachchideradā
sĕlimi pŏṁdugam̐ jesi sikkiṁchugŏṁṭam̐gāga
valavani saṇam̐gula valabiṁchavachchunā

(||em̐ṭi||)
ichchagabum̐jem̐talane yĕlayiṁchavalĕm̐gāga
pĕchchurem̐gi kŏsaridem̐ bippigaṭṭadā
machchigadom̐ bānububai marigiṁchugŏṁṭam̐gāga
rachchalonam̐ bĕnam̐gide radi samagūḍunā

(||em̐ṭi||)
sŏridi gubbala nŏtti sŏkkiṁchavalĕm̐gāga
garuvānam̐ gūḍidenu garivaḍadā
karuṇiṁchi śhrīveṁkaḍeśhum̐ḍe ninnu nelĕ
vŏrasiṭṭĕ paigŏṁṭenu vŏkkaḍaunā manasu