Emtesi nerisinaamdu idu soodare

ఎంతేసి నేరిచినాఁడు ఇటు చూడరే
Language

(॥పల్లవి॥)
ఎంతేసి నేరిచినాఁడు ఇటు చూడరే
కాంతలాల దాఁగీ వీఁపు గానరాఁగా నీతఁడు

(॥ఎంతే॥)
చెక్కులపై వడిసేటి చెమటలు చూడరే
చక్కనిమోములో సిగ్గు చల్లీఁ జూడరే
నెక్కొనఁగ బుసకొట్టే నేరుపులు చూడరే
పక్కనఁ దన నిజము పచరించీ నీతఁడు

(॥ఎంతే॥)
కడలేనితనమేనికళలెల్లాఁ జూడరే
అడియాలపుఁబులక లటు చూడరే
బెడిదమై జారిన పెనుఁదురుము చూడరే
వొడఁబరచీ నన్ను వొద్దికతో నీతఁడు

(॥ఎంతే॥)
తెల్లనికన్నుల మించుతేటతెలివి చూడరే
తొల్లిటిమోవిపై గురుతులు చూడరే
యిల్లిదె శ్రీవేంకటేశుఁ డిప్పుడు దా నన్ను గూడె
కల్లలు నిజముసేసి కరఁగించీ నీతఁడు

(||pallavi||)
ĕṁtesi nerisinām̐ḍu iḍu sūḍare
kāṁtalāla dām̐gī vīm̐pu gānarām̐gā nīdam̐ḍu

(||ĕṁte||)
sĕkkulabai vaḍiseḍi sĕmaḍalu sūḍare
sakkanimomulo siggu sallīm̐ jūḍare
nĕkkŏnam̐ga busagŏṭṭe nerubulu sūḍare
pakkanam̐ dana nijamu pasariṁchī nīdam̐ḍu

(||ĕṁte||)
kaḍalenidanamenigaḽalĕllām̐ jūḍare
aḍiyālabum̐bulaga laḍu sūḍare
bĕḍidamai jārina pĕnum̐durumu sūḍare
vŏḍam̐barasī nannu vŏddigado nīdam̐ḍu

(||ĕṁte||)
tĕllanigannula miṁchudeḍadĕlivi sūḍare
tŏlliḍimovibai gurudulu sūḍare
yillidĕ śhrīveṁkaḍeśhum̐ ḍippuḍu dā nannu gūḍĕ
kallalu nijamusesi karam̐giṁchī nīdam̐ḍu