ఎంతవేడుకో తనకు నింత నీకు బత్తిసేసీ
(॥పల్లవి॥)
ఎంతవేడుకో తనకు నింత నీకు బత్తిసేసీ
మంతనాన నీవూ నిట్టె మన్నించవయ్యా
(॥ఎంత॥)
నెలఁత పోరుగునను నీపై పద్యాలు చదివీ
వెలలేనివేడుకతో వినవయ్య
వలపుతో నిన్ను దిద్ది వాకిటనే తోంగిచూచీ
నిలిచి మాఱుకుమాఱు నీమోము చూపవయ్యా
(॥ఎంత॥)
తరుణి నీకెరుకగా తనలోనే తా నవ్వీ
మరిగించుకొని నీవూ మాటాడవయ్యా
విరుల నీమేను దాఁక వేసీని సారెసారె
గరిమల నీవూ నింకఁ గాఁగిలించవయ్యా
(॥ఎంత॥)
చెనకుతా నీకు మొక్కి సేవలెల్లాఁ జేసీని
యెనసితివి తెరలో నింతలో నీవు
పెనఁగి యలమేల్‌మంగప్రియుఁడ శ్రీవేంకటేశ
నను నేలితివి యానాయకి నీకయ్యా
(||pallavi||)
ĕṁtaveḍugo tanagu niṁta nīgu battisesī
maṁtanāna nīvū niṭṭĕ manniṁchavayyā
(||ĕṁta||)
nĕlam̐ta porugunanu nībai padyālu sadivī
vĕlaleniveḍugado vinavayya
valabudo ninnu diddi vāgiḍane toṁgisūsī
nilisi māṟugumāṟu nīmomu sūbavayyā
(||ĕṁta||)
taruṇi nīgĕrugagā tanalone tā navvī
marigiṁchugŏni nīvū māḍāḍavayyā
virula nīmenu dām̐ka vesīni sārĕsārĕ
garimala nīvū niṁkam̐ gām̐giliṁchavayyā
(||ĕṁta||)
sĕnagudā nīgu mŏkki sevalĕllām̐ jesīni
yĕnasidivi tĕralo niṁtalo nīvu
pĕnam̐gi yalamelmaṁgapriyum̐ḍa śhrīveṁkaḍeśha
nanu nelidivi yānāyagi nīgayyā