Emtavaamdavu ninnu nevvamdeṟumgu

ఎంతవాఁడవు నిన్ను నెవ్వఁడెఱుఁగు
Language

(॥పల్లవి॥)
ఎంతవాఁడవు నిన్ను నెవ్వఁడెఱుఁగు
సంతసాలు సేసి మోవి చవి చూపరాదా

(॥ఎంత॥)
మనసెవ్వఁడెఱుఁగు నీమతక మెవ్వఁడెఱుఁగు
ఘనుఁడ నీచేఁతలే కనేముగాక
పెనఁగేవు రమ్మంటా ప్రియములు చెప్పేవు
ననుఁబాయనని ఇట్టె నమ్మించరాదా

(॥ఎంత॥)
గుఱుతెవ్వఁ డెఱుఁగు నీ గుణమెవ్వఁ డెఱుఁగును
మెఱసే నీసుద్దులకు మెచ్చేము గాక
చెఱఁగు వట్టుకొనేవు చెక్కులు నొక్కవచ్చేవు
మఱఁగుల నీ సిగ్గులు మరి చెప్పరాదా

(॥ఎంత॥)
వలపెవ్వఁ డెఱుఁగు నీ వాడికె యెవ్వఁడెఱుఁగు
కలసిన నీ రతియే కనేము గాక
బలిమి శ్రీ వేంకటేశ పై కొంటివి నన్ను నిట్టె
నలువంకవారు మెచ్చ నమ్మించరాదా

(||pallavi||)
ĕṁtavām̐ḍavu ninnu nĕvvam̐ḍĕṟum̐gu
saṁtasālu sesi movi savi sūbarādā

(||ĕṁta||)
manasĕvvam̐ḍĕṟum̐gu nīmadaga mĕvvam̐ḍĕṟum̐gu
ghanum̐ḍa nīsem̐tale kanemugāga
pĕnam̐gevu rammaṁṭā priyamulu sĕppevu
nanum̐bāyanani iṭṭĕ nammiṁcharādā

(||ĕṁta||)
guṟudĕvvam̐ ḍĕṟum̐gu nī guṇamĕvvam̐ ḍĕṟum̐gunu
mĕṟase nīsuddulagu mĕchchemu gāga
sĕṟam̐gu vaṭṭugŏnevu sĕkkulu nŏkkavachchevu
maṟam̐gula nī siggulu mari sĕpparādā

(||ĕṁta||)
valabĕvvam̐ ḍĕṟum̐gu nī vāḍigĕ yĕvvam̐ḍĕṟum̐gu
kalasina nī radiye kanemu gāga
balimi śhrī veṁkaḍeśha pai kŏṁṭivi nannu niṭṭĕ
naluvaṁkavāru mĕchcha nammiṁcharādā