Emtasesinaa neevu innidigim daguduvu

ఎంతసేసినా నీవు ఇన్నిటికిఁ దగుదువు
Language

(॥పల్లవి॥)
ఎంతసేసినా నీవు ఇన్నిటికిఁ దగుదువు
బంతికిఁ బిలుతు సిగ్గువడేవని కాని

(॥॥)
బగివాయ కాపెమీఁదిపరాకుననున్నవేళ
నగినదే చాలదా నాతో నీవు
పొగడుదు నిందరిలో పొంచి నీ సుద్దులు చెప్పి-
యగడు సేసితినంటా ననేవనికాని

(॥॥)
చెలిఁగాఁగిలించేవేళ చేరి నిన్నుఁబిలిచితే
పలుకుటే చాలదా పై పై నీవు
సొలసిందుకు మొక్కుదు చూచినవా రేమని
తలఁతురో యని కొంకి దాఁగేవనికాని

(॥॥)
వోడక మీరిద్దరును వుండఁగా నే వచ్చితే
కూడుటే చాలదా గొబ్బననీవు
వీడె మిత్తు నిందుకు శ్రీవేంకటేశ వెంగెమని
వాడు మోముతోఁదలవంచేవనికాని

(||pallavi||)
ĕṁtasesinā nīvu inniḍigim̐ daguduvu
baṁtigim̐ biludu sigguvaḍevani kāni

(||||)
bagivāya kābĕmīm̐dibarāgunanunnaveḽa
naginade sāladā nādo nīvu
pŏgaḍudu niṁdarilo pŏṁchi nī suddulu sĕppi-
yagaḍu sesidinaṁṭā nanevanigāni

(||||)
sĕlim̐gām̐giliṁcheveḽa seri ninnum̐biliside
paluguḍe sāladā pai pai nīvu
sŏlasiṁdugu mŏkkudu sūsinavā remani
talam̐turo yani kŏṁki dām̐gevanigāni

(||||)
voḍaga mīriddarunu vuṁḍam̐gā ne vachchide
kūḍuḍe sāladā gŏbbananīvu
vīḍĕ mittu niṁdugu śhrīveṁkaḍeśha vĕṁgĕmani
vāḍu momudom̐dalavaṁchevanigāni