Emtasesinaa neegu yeravulavaam didamdu

ఎంతసేసినా నీకు యెరవులవాఁ డితఁడు
Language

(॥పల్లవి॥)
ఎంతసేసినా నీకు యెరవులవాఁ డితఁడు
సంతతము తొల్లి నాకు చనవిచ్చినాఁడు

(॥ఎంత॥)
తెరమరఁగున నుండి తేనెగార మాఁటలాడి
మరిగించితి వవునే మగని నీవు
సరసము లాడుకొంటా సన్నలు సేసుకొంటా
తరితీపుల నితనిఁదగిలించుకొంటివే

(॥ఎంత॥)
వొంటినుండి యేకతాన వొడఁబరచి పరచి
వెంటఁదెచ్చుకొంటివౌనే విభుని నీవు
నంటులు చూపుకొంటా నవ్వులు నవ్వుకొంటా
ఇంటిలో గూడితివౌనే యీతనితోను

(॥ఎంత॥)
గుఱుతులు మేన నించి గుబ్బుల నూఁది యూఁది
కఱఁగించితివౌనే కాంతుని నీవు
యెఱిఁగి శ్రీవేంకటేశుఁ డీతఁడే నన్ను నేలె
మఱి నీవితని దిక్కు మళ్ళిచూడనేఁటికే

(||pallavi||)
ĕṁtasesinā nīgu yĕravulavām̐ ḍidam̐ḍu
saṁtadamu tŏlli nāgu sanavichchinām̐ḍu

(||ĕṁta||)
tĕramaram̐guna nuṁḍi tenĕgāra mām̐ṭalāḍi
marigiṁchidi vavune magani nīvu
sarasamu lāḍugŏṁṭā sannalu sesugŏṁṭā
taridībula nidanim̐dagiliṁchugŏṁṭive

(||ĕṁta||)
vŏṁṭinuṁḍi yegadāna vŏḍam̐barasi parasi
vĕṁṭam̐dĕchchugŏṁṭivaune vibhuni nīvu
naṁṭulu sūbugŏṁṭā navvulu navvugŏṁṭā
iṁṭilo gūḍidivaune yīdanidonu

(||ĕṁta||)
guṟudulu mena niṁchi gubbula nūm̐di yūm̐di
kaṟam̐giṁchidivaune kāṁtuni nīvu
yĕṟim̐gi śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍe nannu nelĕ
maṟi nīvidani dikku maḽḽisūḍanem̐ṭige