ఎంతచన విచ్చితివి యీపెకు నీవు
(॥పల్లవి॥)
ఎంతచన విచ్చితివి యీపెకు నీవు
సంతవెట్టి వలపులు సారె నమ్మీ నీకును
(॥ఎంత॥)
కన్నుల కలికికొమ్మ కాంతలెల్లఁ జూడఁగాను
సన్నలనే నిన్ను నెంత సాదించీని
వన్నెవలిపెవయ్యద వల్లె వాటువేసుకొని
చన్నులుచూపుకొంటా సముకాన నున్నది
(॥ఎంత॥)
చిలుకలకొలికియై చిగురుఁ బెదవులను
పలుకుల నిన్ను నెంత భ్రమయించీని
నిలువుఁ గొప్పు వెట్టుక నిన్ను నెలయించుకొంటా
పలుమారు నీతో నెంతపచ్చిగా నవ్వీని
(॥ఎంత॥)
ముద్దులబిటారికత్తె మొక్కలాన నీపాదాలు
గుద్దేనంటాఁ బానువుపై గూచున్నది
అద్దో శ్రీవేంకటేశ అలమేల్‌మంగపతివి
అద్దుక నన్నేలితివి అసతోఁ దానున్నది
(||pallavi||)
ĕṁtasana vichchidivi yībĕgu nīvu
saṁtavĕṭṭi valabulu sārĕ nammī nīgunu
(||ĕṁta||)
kannula kaligigŏmma kāṁtalĕllam̐ jūḍam̐gānu
sannalane ninnu nĕṁta sādiṁchīni
vannĕvalibĕvayyada vallĕ vāḍuvesugŏni
sannulusūbugŏṁṭā samugāna nunnadi
(||ĕṁta||)
silugalagŏligiyai sigurum̐ bĕdavulanu
palugula ninnu nĕṁta bhramayiṁchīni
niluvum̐ gŏppu vĕṭṭuga ninnu nĕlayiṁchugŏṁṭā
palumāru nīdo nĕṁtabachchigā navvīni
(||ĕṁta||)
muddulabiḍārigattĕ mŏkkalāna nībādālu
guddenaṁṭām̐ bānuvubai gūsunnadi
addo śhrīveṁkaḍeśha alamelmaṁgabadivi
adduga nannelidivi asadom̐ dānunnadi