Emtani vinnavimchenu ivi danagu

ఎంతని విన్నవించేను ఇవి దనకు
Language

(॥పల్లవి॥)
ఎంతని విన్నవించేను ఇవి దనకు
చెంతనే వా వోజ ఇది చిత్తమే యెరుఁగును

(॥ఎంత॥)
జవ్వనమే విరివాయ జంకెనలు యెరవాయ
నవ్వులే తరవాయ నాకుఁ దనకు
దివ్వెలెత్తుఁ బొద్దులాయ దిన మొకసుద్దులాయ
రవ్వలు సేయక ఇఁక రమ్మననే విభుని

(॥ఎంత॥)
వినుకులే కతలాయ విరహమే వెతలాయ
ననుపు సమ్మతాలాయ నాకుఁ దనకు
మన సోళజోత్తులాయ మాఁటలే కొత్తలాయ
పెనగొనిఁ దమి తలఁపించవే విభుని

(॥ఎంత॥)
మోవి తెనె విందులాయ మొరఁగులే మందులాయ
నా వలపే పొందులాయ నాకుఁ దనకు
వావులు చక్కట్లాయ భావము లొక్కట్లాయ
సేవించే నెచ్చరించవే శ్రీవేంకటవిభుని

(||pallavi||)
ĕṁtani vinnaviṁchenu ivi danagu
sĕṁtane vā voja idi sittame yĕrum̐gunu

(||ĕṁta||)
javvaname virivāya jaṁkĕnalu yĕravāya
navvule taravāya nāgum̐ danagu
divvĕlĕttum̐ bŏddulāya dina mŏgasuddulāya
ravvalu seyaga im̐ka rammanane vibhuni

(||ĕṁta||)
vinugule kadalāya virahame vĕdalāya
nanubu sammadālāya nāgum̐ danagu
mana soḽajottulāya mām̐ṭale kŏttalāya
pĕnagŏnim̐ dami talam̐piṁchave vibhuni

(||ĕṁta||)
movi tĕnĕ viṁdulāya mŏram̐gule maṁdulāya
nā valabe pŏṁdulāya nāgum̐ danagu
vāvulu sakkaṭlāya bhāvamu lŏkkaṭlāya
seviṁche nĕchchariṁchave śhrīveṁkaḍavibhuni