ఎంతని విన్నవించేము యింతి నీపైఁగల బత్తి
(॥పల్లవి॥)
ఎంతని విన్నవించేము యింతి నీపైఁగల బత్తి
చింతదీర నాదరించి సేవగొనరాదా
(॥ఎంత॥)
రెప్పలకొలఁదులాయ రేతిరెల్లా జాగరాలు
కుప్పలుఁదెప్పలు నాయ కోరికలు
చెప్పరాని తమితోడ చెక్కుచేతితో నున్నది
కప్పురగంది నిట్టె కరుణించరాదా
(॥ఎంత॥)
కొండలుఁ గోటులు నాయ గుబ్బతిలి వలపులు
దండిమూఁకలు గట్టెను తమకములు
నిండు నిధానమువలె నీ యెదుట నున్న దింతి
చండిసేయ కిఁకనైనాఁ జనవియ్యరాదా
(॥ఎంత॥)
వూర నూర నూఁటలాయ వుట్టిపడి మోవితేనె
తారుకాణలాయ లోలో తరితీపులు
యీరీతి శ్రీవేంకటేశ యింతలోనే కూడితివి
చేరి యీకె నిట్లానే చిత్తగించరాదా
(||pallavi||)
ĕṁtani vinnaviṁchemu yiṁti nībaim̐gala batti
siṁtadīra nādariṁchi sevagŏnarādā
(||ĕṁta||)
rĕppalagŏlam̐dulāya redirĕllā jāgarālu
kuppalum̐dĕppalu nāya korigalu
sĕpparāni tamidoḍa sĕkkusedido nunnadi
kappuragaṁdi niṭṭĕ karuṇiṁcharādā
(||ĕṁta||)
kŏṁḍalum̐ goḍulu nāya gubbadili valabulu
daṁḍimūm̐kalu gaṭṭĕnu tamagamulu
niṁḍu nidhānamuvalĕ nī yĕduḍa nunna diṁti
saṁḍiseya kim̐kanainām̐ janaviyyarādā
(||ĕṁta||)
vūra nūra nūm̐ṭalāya vuṭṭibaḍi movidenĕ
tārugāṇalāya lolo taridībulu
yīrīdi śhrīveṁkaḍeśha yiṁtalone kūḍidivi
seri yīgĕ niṭlāne sittagiṁcharādā