ఎంతని చెప్పుదునే ఇదిగో నా తలపోఁత
(॥పల్లవి॥)
ఎంతని చెప్పుదునే ఇదిగో నా తలపోఁత
చింతామణియాయ నాకు చిత్తజజనకుఁడు
(॥ఎంత॥)
అడియాసలనే అలసీనే నామనసు
కడుఁబతిగుణము లిక్కడఁ జెప్పఁగా
నిడువాలుఁ జూపులు నివ్వెరగు నొందీనే
చిడుముడివేడుకలు చిమ్మిరేఁచఁగాను
(॥ఎంత॥)
చెలరేఁగి తమితోడఁ జెమరించీనే చెక్కులు
చెలువునివుంగరముచేతికిఁగాను
వులివచ్చివలపులు వుమ్మగిలఁగడఁగీనే
నులిగొన్న కోరికలు నోరూరించఁగాను
(॥ఎంత॥)
వొట్టినసంతోసాన వుప్పొంగీనే జవ్వనము
తొట్టి శ్రీవేంకటేశ్వరుఁ దోడితేఁగాను
ఇట్టె నన్నేలినాఁడు యే నలమేలుమంగను
పొట్టఁబొరుగున మీరు పొదిసేయఁగాను
(||pallavi||)
ĕṁtani sĕppudune idigo nā talabom̐ta
siṁtāmaṇiyāya nāgu sittajajanagum̐ḍu
(||ĕṁta||)
aḍiyāsalane alasīne nāmanasu
kaḍum̐badiguṇamu likkaḍam̐ jĕppam̐gā
niḍuvālum̐ jūbulu nivvĕragu nŏṁdīne
siḍumuḍiveḍugalu simmirem̐sam̐gānu
(||ĕṁta||)
sĕlarem̐gi tamidoḍam̐ jĕmariṁchīne sĕkkulu
sĕluvunivuṁgaramusedigim̐gānu
vulivachchivalabulu vummagilam̐gaḍam̐gīne
nuligŏnna korigalu norūriṁcham̐gānu
(||ĕṁta||)
vŏṭṭinasaṁtosāna vuppŏṁgīne javvanamu
tŏṭṭi śhrīveṁkaḍeśhvarum̐ doḍidem̐gānu
iṭṭĕ nannelinām̐ḍu ye nalamelumaṁganu
pŏṭṭam̐bŏruguna mīru pŏdiseyam̐gānu