Emtani pogademammaa yeedani gunaalu nemu

ఎంతని పొగడేమమ్మా యీతని గుణాలు నేము
Language

(॥పల్లవి॥)
ఎంతని పొగడేమమ్మా యీతని గుణాలు నేము
సంతోసాలే నెరపేటి జాణఁడే నీ మగఁడు

(॥ఎంత॥)
యెనసిన కాంత దను నెంత కొసరినాను
చనవిచ్చుఁగాని మరి సాదించఁడు
వెనుకొని మరి యెన్నివిన్నపాలు సేసినాను
వినుఁగాని యెఁతైనా వేసారఁడు

(॥ఎంత॥)
సన్నలా చాయలా నెట్టు సణఁగులు రాలిచినా
మన్నించుఁగాని మరి మచ్చరించఁడు
కన్నులఁ దప్పక చూచి కడు నెంత వొరసినా
వున్నతితో నవ్వుఁగాని వుప్పతించఁడు

(॥ఎంత॥)
కూరిమి గొసరుకొంటా కొంగువట్టి తీసినాను
కోరిక చెల్లించుఁగాని గుంపించఁడు
యీరీతి శ్రీవేంకటేశుఁ డింతి నిన్ను నిట్టె కూడె
నేరుపుతో నేలుగాని నీతోఁగూడి పాయఁడు

(||pallavi||)
ĕṁtani pŏgaḍemammā yīdani guṇālu nemu
saṁtosāle nĕrabeḍi jāṇam̐ḍe nī magam̐ḍu

(||ĕṁta||)
yĕnasina kāṁta danu nĕṁta kŏsarinānu
sanavichchum̐gāni mari sādiṁcham̐ḍu
vĕnugŏni mari yĕnnivinnabālu sesinānu
vinum̐gāni yĕm̐tainā vesāram̐ḍu

(||ĕṁta||)
sannalā sāyalā nĕṭṭu saṇam̐gulu rālisinā
manniṁchum̐gāni mari machchariṁcham̐ḍu
kannulam̐ dappaga sūsi kaḍu nĕṁta vŏrasinā
vunnadido navvum̐gāni vuppadiṁcham̐ḍu

(||ĕṁta||)
kūrimi gŏsarugŏṁṭā kŏṁguvaṭṭi tīsinānu
koriga sĕlliṁchum̐gāni guṁpiṁcham̐ḍu
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍiṁti ninnu niṭṭĕ kūḍĕ
nerubudo nelugāni nīdom̐gūḍi pāyam̐ḍu