Emtani pogadavachchu nimtadi needevulanu

ఎంతని పొగడవచ్చు నింతటి నీదేవులను
Language

(॥పల్లవి॥)
ఎంతని పొగడవచ్చు నింతటి నీదేవులను
సంతోసానఁ గూడితివి జాణవౌదువయ్యా

(॥ఎంత॥)
జిగిమించ ముద్దుగారే చిలుకపలుకులే
మగవ నోరనుడిగే మాఁట లెల్లాను
వెగటు లేని యట్టి వెన్నెలలపోగులే
చిగురుఁ బెదవులపై చిరునవ్వులెల్లాను

(॥ఎంత॥)
తొలుకరికాలపు తోరవు మెఱుఁగులే
సొలసి రమణిచూచే చూపులెల్లాను
పెలుచు గండుఁదుమ్మిదలపిల్లల మూఁకలే
నిలువుఁ గొప్పువెట్టిననెరులెల్లాను

(॥ఎంత॥)
కడలేనికాంతుల కలకపుఁ గుండలే
పడఁతిగట్టిచన్నుల బాగులెల్లాను
అడరి శ్రీవేంకటేశ యలమేలుమంగయాకె
యెడయని నీభాగ్యమే యాగురుతులెల్లాను

(||pallavi||)
ĕṁtani pŏgaḍavachchu niṁtaḍi nīdevulanu
saṁtosānam̐ gūḍidivi jāṇavauduvayyā

(||ĕṁta||)
jigimiṁcha muddugāre silugabalugule
magava noranuḍige mām̐ṭa lĕllānu
vĕgaḍu leni yaṭṭi vĕnnĕlalabogule
sigurum̐ bĕdavulabai sirunavvulĕllānu

(||ĕṁta||)
tŏlugarigālabu toravu mĕṟum̐gule
sŏlasi ramaṇisūse sūbulĕllānu
pĕlusu gaṁḍum̐dummidalabillala mūm̐kale
niluvum̐ gŏppuvĕṭṭinanĕrulĕllānu

(||ĕṁta||)
kaḍalenigāṁtula kalagabum̐ guṁḍale
paḍam̐tigaṭṭisannula bāgulĕllānu
aḍari śhrīveṁkaḍeśha yalamelumaṁgayāgĕ
yĕḍayani nībhāgyame yāgurudulĕllānu