(॥పల్లవి॥)
ఎంతనేర్చెనే యీ కలికి
ఇంతుల కేఁటికే ఇంతేసి పగటు
(॥ఎంత॥)
చలములు నెరపుచు సవతుల దూరుచు
సలిగెలఁ బొరలీ జపరాలు
చెలవుని సాలయుచు చేతులు చాఁపుచు
కెలపుల నగవులఁ గెరలీని
(॥ఎంత॥)
సాటికిఁ బెనఁగుచు సణఁగులు రాల్చుచు
నీటులన మురిసీ నెరజాణ
మాటల గునియుచు మదమున మొరయుచు
జూటుఁదనంబునఁజూచీని
(॥ఎంత॥)
మంతనామాడుచు మలయుచు నవ్వుచు
పంతములాడీ పసలాఁడి
యింతలో శ్రీవేంకటేశుఁడు నన్నేలె
పొంతనుండి ననుఁ బొగడీని
(||pallavi||)
ĕṁtanersĕne yī kaligi
iṁtula kem̐ṭige iṁtesi pagaḍu
(||ĕṁta||)
salamulu nĕrabusu savadula dūrusu
saligĕlam̐ bŏralī jabarālu
sĕlavuni sālayusu sedulu sām̐pusu
kĕlabula nagavulam̐ gĕralīni
(||ĕṁta||)
sāḍigim̐ bĕnam̐gusu saṇam̐gulu rālsusu
nīḍulana murisī nĕrajāṇa
māḍala guniyusu madamuna mŏrayusu
jūḍum̐danaṁbunam̐jūsīni
(||ĕṁta||)
maṁtanāmāḍusu malayusu navvusu
paṁtamulāḍī pasalām̐ḍi
yiṁtalo śhrīveṁkaḍeśhum̐ḍu nannelĕ
pŏṁtanuṁḍi nanum̐ bŏgaḍīni