ఎంతమోహమో నీపై నేమని చెప్పఁగవచ్చు
(॥పల్లవి॥)
ఎంతమోహమో నీపై నేమని చెప్పఁగవచ్చు
సంతోసమున నితని సరుసఁ గూచుండవే
(॥ఎంత॥)
కొమలు లెందరు తనకొలువులో నుండినాను
నీమొగ మేమిచూచీని నీవిభుఁడు
కామించి యెవ్వ రెంతేసికతలు చెప్పినాను
అముకొని నీగుణాలే అడిగీ నితఁడు
(॥ఎంత॥)
చేపట్టి యేవనితలు చేతులు పైఁజాఁచినాను
నీపైనే చేయివేసీ నీవిభుఁడు
దాపుననుండెంతచక్కఁదనము తాము చూపినా
పూఁపలైన నీచన్నులే పొగడీ నితఁడు
(॥ఎంత॥)
చెలులెందరుఁ దనపై సేనలు చల్లినాను
నెలకొని నిన్ను నేలె నీవిభుఁడు
అలమేలుమంగవు నీవతఁడు శ్రీవేంకటేశుఁ-
డిలతా మెంతగూడినా నింపు నీపై నితఁడు
(||pallavi||)
ĕṁtamohamo nībai nemani sĕppam̐gavachchu
saṁtosamuna nidani sarusam̐ gūsuṁḍave
(||ĕṁta||)
kŏmalu lĕṁdaru tanagŏluvulo nuṁḍinānu
nīmŏga memisūsīni nīvibhum̐ḍu
kāmiṁchi yĕvva rĕṁtesigadalu sĕppinānu
amugŏni nīguṇāle aḍigī nidam̐ḍu
(||ĕṁta||)
sebaṭṭi yevanidalu sedulu paim̐jām̐sinānu
nībaine seyivesī nīvibhum̐ḍu
dābunanuṁḍĕṁtasakkam̐danamu tāmu sūbinā
pūm̐palaina nīsannule pŏgaḍī nidam̐ḍu
(||ĕṁta||)
sĕlulĕṁdarum̐ danabai senalu sallinānu
nĕlagŏni ninnu nelĕ nīvibhum̐ḍu
alamelumaṁgavu nīvadam̐ḍu śhrīveṁkaḍeśhum̐-
ḍiladā mĕṁtagūḍinā niṁpu nībai nidam̐ḍu