ఎంతలేదు నీ పగటు యేమిచెప్పేదే
(॥పల్లవి॥)
ఎంతలేదు నీ పగటు యేమిచెప్పేదే
మంతనాన నా కితఁడు మాట ఇచ్చినాఁడు
(॥ఎంత॥)
కందవ లేమిచూపేవే కన్నుసన్నలను
మందు లెంతనూరేవే మంచిమాటల
యెందరైనా సవతులు యిరుమేలా నుండఁగాను
అంది నీవే యీతనికి నాలవైతివా
(॥ఎంత॥)
ఆసలేల పుట్టించేవే అట్టె ముందటఁ బొలసి
వేసా లేమి సేసేవే వెడనవ్వుల
సేసలువెట్టినవారు చేరి కాచుకుండఁగాను
బేసబెల్లినిన్ను నేఁడు పెండ్లాడీనా
(॥ఎంత॥)
వావు లేమి దెలిపేవే వాడికచేఁతలను
మోవేల కదలించేవే మురిపముల
యీవల నలమేల్‌మంగ యేను గూడివుండఁగాను
శ్రీవేంకటేశుఁడు నీకుఁ జేతికిలోనయ్యీనా
(||pallavi||)
ĕṁtaledu nī pagaḍu yemisĕppede
maṁtanāna nā kidam̐ḍu māḍa ichchinām̐ḍu
(||ĕṁta||)
kaṁdava lemisūbeve kannusannalanu
maṁdu lĕṁtanūreve maṁchimāḍala
yĕṁdarainā savadulu yirumelā nuṁḍam̐gānu
aṁdi nīve yīdanigi nālavaidivā
(||ĕṁta||)
āsalela puṭṭiṁcheve aṭṭĕ muṁdaḍam̐ bŏlasi
vesā lemi seseve vĕḍanavvula
sesaluvĕṭṭinavāru seri kāsuguṁḍam̐gānu
besabĕllininnu nem̐ḍu pĕṁḍlāḍīnā
(||ĕṁta||)
vāvu lemi dĕlibeve vāḍigasem̐talanu
movela kadaliṁcheve muribamula
yīvala nalamelmaṁga yenu gūḍivuṁḍam̐gānu
śhrīveṁkaḍeśhum̐ḍu nīgum̐ jedigilonayyīnā