ఎంతలేటి యాసోద మేది గొలఁది
(॥పల్లవి॥)
ఎంతలేటి యాసోద మేది గొలఁది
సంతోసాన లోలోనే జడిగొనరాదా
(॥ఎంత॥)
తగవులు చెప్పఁగానే దప్పిదేరీ నీమోవి
అగడేల పన్నీట నద్దుకోరాదా
తగుబాస లియ్యఁగానే తనువెల్లా బడలెను
పగటునఁ గొంతవడి పవళించరాదా
(॥ఎంత॥)
చెంది సేసలు చల్లఁగానే చెమరించె మేనెల్లా
చందముగా గందవొడి చల్లుకోరాదా
అంది యింటింటి కేఁగఁగా అట్టె వేసటలు రేఁగె
పొందుగాఁ గొంతవూరట పుచ్చుకోరాదా
(॥ఎంత॥)
చెలుములు సేయఁగానే చిత్తమెల్లాఁ గరఁగెను
చెలఁగి గుండెబలిమి చేసుకోరాదా
నిలిచి శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
కలసితి విన్నిటాను కరుణించరాదా
(||pallavi||)
ĕṁtaleḍi yāsoda medi gŏlam̐di
saṁtosāna lolone jaḍigŏnarādā
(||ĕṁta||)
tagavulu sĕppam̐gāne dappiderī nīmovi
agaḍela pannīḍa naddugorādā
tagubāsa liyyam̐gāne tanuvĕllā baḍalĕnu
pagaḍunam̐ gŏṁtavaḍi pavaḽiṁcharādā
(||ĕṁta||)
sĕṁdi sesalu sallam̐gāne sĕmariṁchĕ menĕllā
saṁdamugā gaṁdavŏḍi sallugorādā
aṁdi yiṁṭiṁṭi kem̐gam̐gā aṭṭĕ vesaḍalu rem̐gĕ
pŏṁdugām̐ gŏṁtavūraḍa puchchugorādā
(||ĕṁta||)
sĕlumulu seyam̐gāne sittamĕllām̐ garam̐gĕnu
sĕlam̐gi guṁḍĕbalimi sesugorādā
nilisi śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
kalasidi vinniḍānu karuṇiṁcharādā