(॥పల్లవి॥)
ఎంతలేదన్నా నవి ఏల మానీని
చెంతల నీ వేడుకలు చెల్లింతువుగాక
(॥ఎంత॥)
పఱపుపై నీకు నాపె పాదములు గుద్దఁగాను
తఱితోడి వలపులు దైవారవా
నెఱి సురటి విసరి నిన్ను నిట్టె చూడఁగాను
గుఱిలేనికోరికలు గుబ్బతిలవా
(॥ఎంత॥)
వేసరక సారెసారె విడెము నీ కియ్యఁగాను
ఆసలు నీమతిలోన నల్లుకొనవా
రాసికెక్క నీతో సరసములెల్లా నాడఁగా
పోసరించి తమకము పారిఁ బిక్కటిల్లదా
(॥ఎంత॥)
పాయక యేపొద్దు నాపె పక్కనే పండుండఁగాను
ఆయాలంటి పరవశమందదా మేను
యీయెడ శ్రీవేంటేశ యేలితివి నన్ను నేఁడు
చాయల నీజవ్వనము సఫలము గాదా
(||pallavi||)
ĕṁtaledannā navi ela mānīni
sĕṁtala nī veḍugalu sĕlliṁtuvugāga
(||ĕṁta||)
paṟabubai nīgu nābĕ pādamulu guddam̐gānu
taṟidoḍi valabulu daivāravā
nĕṟi suraḍi visari ninnu niṭṭĕ sūḍam̐gānu
guṟilenigorigalu gubbadilavā
(||ĕṁta||)
vesaraga sārĕsārĕ viḍĕmu nī kiyyam̐gānu
āsalu nīmadilona nallugŏnavā
rāsigĕkka nīdo sarasamulĕllā nāḍam̐gā
posariṁchi tamagamu pārim̐ bikkaḍilladā
(||ĕṁta||)
pāyaga yebŏddu nābĕ pakkane paṁḍuṁḍam̐gānu
āyālaṁṭi paravaśhamaṁdadā menu
yīyĕḍa śhrīveṁṭeśha yelidivi nannu nem̐ḍu
sāyala nījavvanamu saphalamu gādā