Emtale deebe nadana liviyum gonni

ఎంతలే దీపె నటన లివియుఁ గొన్ని
Language

(॥పల్లవి॥)
ఎంతలే దీపె నటన లివియుఁ గొన్ని
చెంత నన్నీఁ గానవచ్చె చెలియ రాఁగదవే

(॥ఎంత॥)
యేతరికాంతల సుద్దు లెవ్వరెరుఁగుదురమ్మా
ఆతఁడు వలచుఁ దనకంటాఁ జెప్పీని
పోతరించి పొద్దువోక బొమ్మల గాటుకవెట్టీ
యాతల నీపె వేసా లేమని చెప్పేదే

(॥ఎంత॥)
జూటు సతులచేఁతలు సోదించేవా రెవ్వరమ్మా
కూటమి నాతనిమేన గోరు చూపీని
కోటిసేయఁ బెదవిపైఁ గూరవండి కసవేరీ
యాటున నీపె గుణము లేమని చెప్పేదే

(॥ఎంత॥)
కావరపింతులజాడ గన్నవారెవ్వరో యమ్మా
శ్రీవేంకటపతివద్దఁ జేరి నవ్వీని
కావించి నన్నితఁడేలె కతకుఁ గాళ్ళడిగీని
యావేళ యాపెనేరుపు లేమని చెప్పేదే

(||pallavi||)
ĕṁtale dībĕ naḍana liviyum̐ gŏnni
sĕṁta nannīm̐ gānavachchĕ sĕliya rām̐gadave

(||ĕṁta||)
yedarigāṁtala suddu lĕvvarĕrum̐gudurammā
ādam̐ḍu valasum̐ danagaṁṭām̐ jĕppīni
podariṁchi pŏdduvoga bŏmmala gāḍugavĕṭṭī
yādala nībĕ vesā lemani sĕppede

(||ĕṁta||)
jūḍu sadulasem̐talu sodiṁchevā rĕvvarammā
kūḍami nādanimena goru sūbīni
koḍiseyam̐ bĕdavibaim̐ gūravaṁḍi kasaverī
yāḍuna nībĕ guṇamu lemani sĕppede

(||ĕṁta||)
kāvarabiṁtulajāḍa gannavārĕvvaro yammā
śhrīveṁkaḍabadivaddam̐ jeri navvīni
kāviṁchi nannidam̐ḍelĕ kadagum̐ gāḽḽaḍigīni
yāveḽa yābĕnerubu lemani sĕppede