Emtainaa naadodi sare yeṟamgadugaaga taanu

ఎంతైనా నాతోడి సరే యెఱఁగదుగాక తాను
Language

(॥పల్లవి॥)
ఎంతైనా నాతోడి సరే యెఱఁగదుగాక తాను
ఇంతులాల యీపె యెమ్మె లేమని చెప్పుదమే

(॥ఎంతై॥)
కొప్పునఁ జెరివినవి కొత్తగేదంగిరేకులు
చిప్పిల జవ్వాది జారీఁ జెక్కులవెంట
కుప్పళించుకొన్న దిదె గుబ్బలపై గందవొడి
ఇప్పు డిదె యీపె యెమ్మె లేమని చెప్పుదమే

(॥ఎంతై॥)
సందిఁ గట్టుకొన్నవి చంద్రవంక తాయతులు
అందపు వల్లెవాటు పయ్యద బుజాన
కందువ మొసలిమీఁద కస్తూరి గీరు నామము
యిందరిలో నీపె యెమ్మె లేమని చెప్పుదమే

(॥ఎంతై॥)
పాదమునఁ బెట్టినది పైఁడిబొమ్మల పెండెము
మోదానఁ గట్ట గంటల మొలనూలు
పోదిసేసి నన్ను నేలె పొంచి శ్రీవేంకటేశుఁడు
యీదెస నీపె యెమ్మెలు యేమని చెప్పుదమే

(||pallavi||)
ĕṁtainā nādoḍi sare yĕṟam̐gadugāga tānu
iṁtulāla yībĕ yĕmmĕ lemani sĕppudame

(||ĕṁtai||)
kŏppunam̐ jĕrivinavi kŏttagedaṁgiregulu
sippila javvādi jārīm̐ jĕkkulavĕṁṭa
kuppaḽiṁchugŏnna didĕ gubbalabai gaṁdavŏḍi
ippu ḍidĕ yībĕ yĕmmĕ lemani sĕppudame

(||ĕṁtai||)
saṁdim̐ gaṭṭugŏnnavi saṁdravaṁka tāyadulu
aṁdabu vallĕvāḍu payyada bujāna
kaṁduva mŏsalimīm̐da kastūri gīru nāmamu
yiṁdarilo nībĕ yĕmmĕ lemani sĕppudame

(||ĕṁtai||)
pādamunam̐ bĕṭṭinadi paim̐ḍibŏmmala pĕṁḍĕmu
modānam̐ gaṭṭa gaṁṭala mŏlanūlu
podisesi nannu nelĕ pŏṁchi śhrīveṁkaḍeśhum̐ḍu
yīdĕsa nībĕ yĕmmĕlu yemani sĕppudame