ఎంతైన నీ యాల నింతే ఇందులో తప్పులెంచకు
(॥పల్లవి॥)
ఎంతైన నీ యాల నింతే ఇందులో తప్పులెంచకు
మంతనాన నీవు నా మనవి చేకోవయ్య
(॥ఎంతై॥)
విచ్చన విడిని నీతో వేమారు నవ్వితిని
ఇచ్చకమౌనో కాదో యెఱఁగ నేను
పచ్చిసేసి కమ్మటిని పైకొని చెనకితిని
మచ్చిక సేసుక నన్ను మన్నించవయ్య
(॥ఎంతై॥)
పయ్యదకొంగు వట్టితే పలుమారు మొక్కితిని
ఇయ్యకోతానో కాదో యెఱఁగ నేను
నెయ్యపుమాట లాడఁగానే నీకు మారాడితి
చెయ్యారా నాచనవు చెల్లించవయ్య
(॥ఎంతై॥)
కైవశమైతిననుచు కాఁగిలించి కూడితిని
యేవిధమో నీగుట్టు యెఱఁగనేను
శ్రీ వేంకటేశ్వర నీ చిత్తము నా భాగ్యము
యీ వలన నన్ను మెచ్చి యీడేర్చవయ్యా
(||pallavi||)
ĕṁtaina nī yāla niṁte iṁdulo tappulĕṁchagu
maṁtanāna nīvu nā manavi segovayya
(||ĕṁtai||)
vichchana viḍini nīdo vemāru navvidini
ichchagamauno kādo yĕṟam̐ga nenu
pachchisesi kammaḍini paigŏni sĕnagidini
machchiga sesuga nannu manniṁchavayya
(||ĕṁtai||)
payyadagŏṁgu vaṭṭide palumāru mŏkkidini
iyyagodāno kādo yĕṟam̐ga nenu
nĕyyabumāḍa lāḍam̐gāne nīgu mārāḍidi
sĕyyārā nāsanavu sĕlliṁchavayya
(||ĕṁtai||)
kaivaśhamaidinanusu kām̐giliṁchi kūḍidini
yevidhamo nīguṭṭu yĕṟam̐ganenu
śhrī veṁkaḍeśhvara nī sittamu nā bhāgyamu
yī valana nannu mĕchchi yīḍersavayyā